Tirumala News: తిరుమల భక్తులకు ప్రత్యేక ఐడీ- గూగుల్ ఏఐతో టీటీడీ ఒప్పందం
Tirumala News: తిరుమలలో భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు గూగుల్ ఏఐతో టీటీడీ ఒప్పందం చేసుకోనుంది. వాళ్లకు ప్రత్యేక ఐడీ ఇవ్వనుంది.

Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం గూగుల్‌తో ఒప్పందం చేసుకోనుంది. గూగుల్ అందించే ఉచిత మేథాతో మరిన్ని సేవలు మెరుగ్గా అందివ్వడానికి వీలు కలుగుతుంది. ఇప్పటికే ఏఐ ద్వారా సేవలు అందిస్తున్న టీటీడీ వీటిని మరిన్ని విభాగాలకు విస్తరించనుంది. భక్తులు యాప్ ఓపెన్ చేసినప్పటి నుంచి దర్శనం అయ్యి తిరిగి ఇంటికి చేరే వరకు ఈ యాప్ యూజ్ అవుతుంది.
గూగుల్‌తో ఒప్పందం తర్వాత పైలెట్ ప్రాజెక్టు కింద కొన్ని విభాగాల్లో టెక్నాలజీని వాడుకోనున్నారు. అందులో లోటుపాట్లు తెలుసుకొని అన్ని విభాగలకు అప్లై చేస్తారు. ఈ ఒప్పందంలో భాగంగా ప్రతి భక్తుడిగి ఒక ఐడీ ఇస్తారు. ఆ భక్తులు ఎప్పుడు వచ్చాడు, ఎన్నిసార్లు తిరుమలకు వచ్చాడు. గదులు ఎన్ని బుక్ చేశాడో లాంటి వివరాలు తెలుస్తాయి. ఆ ఐడీతోనే ఆ భక్తుడు శ్రీవారి ఆలయంలో ఏ సేవ అయినా పొందగలడు.
ఇలా భక్తులకు ఐడీ ఇవ్వడం ద్వారా ఎంత మంది భక్తులు వస్తున్నారు. రిపీటెడ్‌గా వచ్చేవాళ్లు ఎంతమంది. వాళ్లను ట్రాక్ చేయడం టీటీడీకి ఈజీ అవుతుంది. ఇవే కాకుండా దర్శనాలు, వసతి, ఇతర సేవలు అందించే విషయంలో కూడా ఏఐను వాడుకోనున్నారు. వచ్చే భక్తుల సంఖ్య ఆధారంగా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునేందుకు వీలు కలుగుతుంది.
స్వామి దర్శనానికి వచ్చేటప్పుడు పాటించాల్సిన విధివిధానాలు ఏంటీ, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి,, ఎలా దర్శించుకోవాలి వంటి అనేక విషయాలను భక్తులకు వారివారి భాషల్లోనే తెలియజేసేందుకు ఈ ఏఐ ఉపయోగపడుతుంది. ఏ ప్రాంతంలో క్యూలైన్లలో ఎంత రద్దీ ఉందో నేరుగా భక్తులే తమ బస ఉండే చోట నుంచే తెలుసుకోవచ్చు. దీని కోసం తిరుమల వ్యాప్తంగా కెమెరాలు గూగుల్ ఏర్పాటు చేయనుంది.
తిరుమలలో భక్తుల పేరుతో వచ్చే నిందితుల కదలికలను కూడా గుర్తించవచ్చు. పోలీసులు వారిపై నిఘా పెట్టి కట్టడి చేస్తారు. మరోవైపు తిరుమలలో దళారీ వ్యవస్థకి కూడా చెక్ పెట్టేందుకు ఈ టెక్నాలజీ యూజ్ అవుతుందని టీటీడీ భావిస్తోంది. మోసపోయే భక్తుల సంఖ్య తగ్గుతుందని అంటున్నారు. వీటన్నింటితోపాటు ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం కూడా చాలా సులభం అవుతోందని అంటున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

