Noor Ahmad Holds Purple Cap : వర్త్ ధోనీ వర్త్.. పది కోట్లకు న్యాయం చేస్తున్న సీఎస్కే బౌలర్ నూర్.. అతని వెనకాల ధోనీ మాస్టర్ మైండ్
గతేడాది మెగా వేలంలో నూర్ అహ్మద్ కోసం సీఎస్కే పట్టుదలగా వ్యవహరించింది. 10 కోట్లకు తనను కొనుగోలు చేయడంపై ఆశ్చర్యం వ్యక్తమైనా,ఇప్పుడు నూర్ తనకి పెట్టిన ధరకు తగిన విధంగా ఆడుతున్నాడు.

IPL 2025 RCB VS CSK MS Dhoni Master Mind: నూర్ అహ్మద్.. ఈ సీజన్లో సంచలనంగా మారాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడటంతో తన దవ తిరిగి పోయింది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ ల్లో ఏడు వికెట్లను తీసుకుని పర్పుల్ క్యాప్ ను సొంతం చేసుకున్నాడు. తన గురించి చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో గొప్పగా చర్చ చేసుకుంటున్నారు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సానబెడుతున్న వజ్రాల్లో మరోక ఆటగాడిగా నూర్ నిలవనున్నాడని పేర్కొంటున్నారు. నిజానికి ఐపీఎల్ ముందు వరకు అంతంతమాత్రంగానే రాణించిన నూర్.. సీఎస్కేలో కి ప్రవేశించడంతో ఒక్కసారిగా అతని రాత మారిపోయింది. ముంబై ఇండియన్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో మెరుపు స్టంపింగ్ ద్వారా ధోనీనే నూర్ కు తొలి వికెట్ అందించాడు. అక్కడి నుంచి ఈ సీజన్ లో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన నూర్.. ఇక వెనుదిరిగి చూసుకోలేదు. తొలి మ్యాచ్ లో నాలుగు వికెట్లు తీసిన ఈ ఆఫ్గన్ బౌలర్.. రెండో మ్యాచ్ లో ఏకంగా మూడు వికెట్లతో సత్తా చాటాడు. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ నుంచి పర్పుల్ క్యాప్ ను సొంతం చేసుకున్నాడు.
WE ARE LUCKY TO WITNESS NOOR AHMAD IN CSK.💛#CSKvRCB #CSKvsRCB #RCBvsCSK #RCBvCSK pic.twitter.com/P6EF2VV1Es
— Ayaan (@_Ayaan_rahman) March 28, 2025
పది కోట్లకు సొంతం చేసుకున్న సీఎస్కే..
ఇక గతేడాది జరిగిన మెగా వేలంలో నాటకీయంగా నూర్ అహ్మద్ ను సీఎస్కే దక్కించుకుంది. తొలుత వేలంలో ముంబై ఇండియన్స్ తో పోటీపడి, రూ.5 కోట్ల వరకు అతని ధరను పెంచుకుంటూ పోయింది. ఇక గతేడాది గుజరాత్ టైటాన్స్ కు నూర్ ఆడటంతో అతని కోసం రైట్ టూ మ్యాచ్ కార్డును టైటాన్స్ వాడింది. దీంతో ఒక్కసారిగా ప్లాన్ చేంజ్ చేసిన సీఎస్కే.. ప్రైస్ ను డబుల్ చేసి పది కోట్లన కోట్ చేసింది. దీంతో టైటాన్స్ అంత మొత్తం చెల్లించలేక వెనుదిరిగింది. ఈక్రమంలో సీఎస్కేకు నూర్ దక్కాడు. అంటే నూర్ ను సొంతం చేసుకోవడం కోసం సీఎస్కే ముందునుంచే ప్రణాళికలు వేసిందని తెలుస్తోంది.
స్పిన్ కు అనుకూలంగా చేపాక్..
చెన్నైలోని చేపాక్ స్టేడియం స్పిన్ కు అనుకూలిస్తుందన్న సంగతి తెలిసిందే. నూర్ అహ్మద్ బౌలింగ్ కు సరిగ్గా చేపాక్ సూట్ అవుతుందని భావించిన సీఏస్కే యాజమాన్యం.. నూర్ ని దక్కించుకునేందుకి వేలంలో ఇంతగా ప్రయత్నించింది. ఇప్పుడు ఆ ఫలితం కనిపిస్తోంది. చేపాక్ స్టేడియంలో నూర్.. చెడుగుడు ఆడుకుంటుండటం చూసి, సీఎస్కే అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీని వెనకాల ధోనీ మాస్టర్ మైండ్ ఉందని భావిస్తున్నారు. అందుకే వర్త్ ధోనీ ధోనీ అన్నట్లుగా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఆడిన రెండు మ్యాచ్ ల్లోనే సత్తా చాటి, ఏడు వికెట్లు తీసిన నూర్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. బ్యాటర్లకు అనుకూలంగా మారిపోతున్న ఐపీఎల్లో ఒక బౌలర్ ఇంతగా రాణించడంపై పలువురు ఆనందిస్తున్నారు.




















