Crime News: గంట సేపు శృంగారం చేసి చంపేసి పోయాడు - భరత్ నగర్ వంతెన కింద జరిగిన హత్య కేసులో వీడిన మిస్టరీ
Murder Case: సనత్ నగర్ పరిధిలో జరిగిన ఓ హత్య కేసును పోలీసులు చేధించారు. వివాహేతర బంధం పెట్టుకున్న వ్యక్తే చంపేశాడని పోలీసులు గుర్తించారు.

Hyderabad Crime: వాళ్లద్దరికీ వివాహేతర బంధం ఉంది. జన సంచారం లేని వంతెనల కింద.. ఖాళీ స్థలాల్లో ఉండే చెట్ల దగ్గర గడిపేసి పోతూంటారు. ఇలా ఓ సారి గడిపిన తర్వాత ఇద్దరి మధ్య ఏదో విషయంలో తేడా వచ్చింది. అతను ఆమెను గుండెల మీద కూర్చుని కొట్టి చంపేశాడు. తర్వాత దుస్తులు కూడా వేయకుండా వెళ్లిపోయాడు. పోలీసులు ఈ కేసును చాలెంజింగ్ గా తీసుకుని నిందితుడ్ని పట్టుకున్నారు.
26వ తేదీన భరత్ నగర్ బ్రిడ్జి కింద నగ్నంగా మహిళ మృతదేహం
ఈ నెల 26 రాత్రి 10 :50 గంటలకు భరత్ నగర్ బ్రిడ్జి కింద చికెన్ షాప్ సమీపంలోని గేటు వద్ద ఒక గుర్తు తెలియని మహిళ హత్యకు గురయిందని పోలీసులకు సమాచారం వచ్చింది. పోలీసులు వెళ్లి చూశారు. ఆ మహిళ ఒంటిపై బట్టలు కూడా లేవు. దీంతో అత్యాచారం కూడా జరిగిందని అనుకున్నారు. పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు.
సీసీ కెమెరాల ఆధారంగా హంతకుడ్ని గుర్తించి అరెస్టు చేసిన పోలీసులు
సమీపంలోని సీసీ కెమెరా దృశ్యాలను పోలీసులు విశ్లేషించారు. హత్య జరగానికి రెండు గంటల ముందు మరో మగ వ్యక్తితో వంతెన వైపు వెళ్లినట్లుగా గుర్తించారు. సీసీ కెమెరా దృశ్యాలు క్లియర్ గా ఉండటం.. అతను పాత నేరస్తుడు కూడా కావడంతో వెంటనే అతని రికార్డులు పోలీసు చేతికి వచ్చాయి. ఆ వ్యక్తిని జనగాం జిల్లా బచ్చన్నపేట గ్రామానికి చెందిన కొమ్మరాజు కనకరాజు @ రాజుగా గుర్తించారు. మహిళను చంపిన తర్వాత కూడా అతను ఎక్కడికి పోలేదు. బాలనగర్ శోభన బస్ స్టాప్ దగ్గర ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు బాలానగర్ పియస్ పరిదిలో దొంగతనం కేసులో 6 నెలలు జైలు శిక్ష అనుభవించాడు. దీంతో అతన్ని పట్టుకోవడం సులువు అయింది.
హతురాలు ఎవరో తెలుసుకోలేకపోయిన పోలీసులు
పోలీసుల విచారణలో ఆ మహిళను తానే చంపినట్లుగా అంగీకరించాడు. ఆ మహిళతో వివాహేతర బంధం ఉందని ఒప్పుకున్నాడు. తామిద్దరం ఆ వంతెన కింద నిర్మానుష్య ప్రదేశంలో తరచూ గడుపుతూ ఉంటామని అలా గడిపిన రోజున ఆమెతో గొడవ అయిందన్నారు. ఆ సమయంలో మహిళ కేకలు వేయడంతో ఆమె ఛాతీపై కూర్చొని పిడికిలితో దెబ్బలు వేసి హత్యకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు ..103(1) బిఎన్‌ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేసి నిందితుని రిమాండుకు తరలిస్తున్నట్లు బాలనగర్ DCP సురేష్ కుమార్ తెలిపారు. అయితే హత్యకు గురైన మహిళ ఎవరు అన్నది ఇంకా తెలియలేదు. హత్య చేసిన వ్యక్తి కూడా ఆ మహిళ అడ్డా మీద పరిచయమే కానీ ఎవరో తెలియదని చెప్పడంతో పోలీసులకు హతురాలు ఎవరో గుర్తించడం కష్టంగా మారింది.





















