Viral Video: లైంగిక వేధింపులు - సవతి తండ్రి ప్రైవేటు పార్ట్స్ కట్ చేసిన యువతి ! వైరల్ అవుతున్న వీడియో
Sexual Abuse: సవతి తండ్రి లైంగికంగా వేధిస్తూండటంతో ఓ యువతి కఠిన నిర్ణయం తీసుకుంది. ఆ వ్యక్తి ప్రైవేటు పార్టులను కత్తిరించేసింది. మహారాష్ట్రలో ఈ ఘటన జరిగింది.

Maharashtra Horror: మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో 24 ఏళ్ల అమ్మాయి తన సవతి తండ్రిపై కత్తితో దాడి చేసింది. ఆమె తన సవతి తండ్రి ప్రైవేట్ పార్టులను కోసేసింది. అతని మెడ , ముఖంపై కూడా గాయపరిచింది. సవతి తండ్రి తనను ఎలా వేధిస్తున్నాడో ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో ఆ అమ్మాయి చేతిలో కత్తితో ఉంది. ఆమె తండ్రి ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉన్నట్లు కనిపిస్తోంది.
పాల్ఘార్‌లో భర్త చనిపోయిన మహిళను రమేష్ అనే వ్యక్తి రెండో వివాహం చేసుకున్నాడు. అప్పటికే ఆ మహిళకు ఓ కుమార్తె ఉంది. పెళ్లి చేసుకున్న తర్వాత రమేష్ తన భార్యపై కాకుండా సవతి కమార్తెపై కన్నేశాడు. అవకాశం దొరికినప్పుడల్లా ఆ అమ్మాయిని అనుచితంగా తాకి లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. రెండు రోజుల కిందట రమేష్ ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి యువతిపై లైంగిక దాడికి ప్లాన్ చేశాడు. తప్పించుకోలేనని తెలిసిన యువతి కొత్త ప్లాన్ చేసింది. కళ్ళకు గంతలు కట్టుకుని కొత్తగా ప్రయత్నిద్దామని చెప్పింది. దానికి రమేష్ ఏమాత్రం సంకోచించకుండా అంగీకరించాడు. అతను కళ్ళు కప్పుకున్న వెంటనే, ఆ అమ్మాయి కత్తిని పట్టుకుని అతనిపై పదే పదే దాడి చేసింది.
महाराष्ट्र : पालघर के वसई में 24 साल की लड़की ने अपने सौतेले पिता रमेश भारती का प्राइवेट पार्ट काट दिया और चाकू से गले पर भी वार किए। रमेश 2 साल से इस बेटी का यौन उत्पीड़न कर रहा था। घायल हॉस्पिटल में है, बेटी अरेस्ट है।@rafique_kamdar pic.twitter.com/wg2yV7epJo
— Sachin Gupta (@SachinGuptaUP) March 27, 2025
రమేష్ కత్తిపోట్లకు తట్టుకోలేక ఇంటి నుండి బయటకు పరిగెత్తాడు. కానీ ఆ యువతి రమేష్ ను వీధిలో పట్టుకుని మళ్ళీ దాడి చేసింది. రోడ్డుపై ఉన్న వారంతా ఆ యువతి దాడి చేయడం చూశారు. దాడి చేసిన తర్వాత యువతి ఏ మాత్రం భయపడకుండా అక్కడే ఉండి .. రమేష్ చేసిన ఆకృత్యాల గురించి వీడియోలో వివరించారు. ఆక్కడ ఓ వ్యక్తి ఈ వీడియో తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
సవతి తండ్రి చేస్తున్న లైంగిక వేధింపులపై తన తల్లికి ఫిర్యాదు చేశానని కానీ ఆమె పట్టించుకోలేదని యువతి చెప్పారు. ఎవరూ రమేష్ చేస్తున్నది తప్పు అని చెప్పకపోవడం, వేధింపులు ఆగకపోవడంతో దాడి చేయాలని నిర్ణయం తీసుకుంది. కాసేపటి తర్వాత ఆ యువతి కత్తిని పక్కన పడేసి పోలీసులకు లొంగిపోయింది. దాడికి గురైన రమేష్ ప్రాణపాయం నుంచి యటపడ్డాడు. యువతిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఇంట్లో లైంగిక వేదింపులు ఎదుర్కొంటున్న ఆడవాళ్లకు కుటుంబసభ్యుల సపోర్టు కూడా లేకపోతే ఇలాంటి ఘోరాలు జరుగుతాయని నెటిజన్లు అంటన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

