Tiger News: నిన్న ఆదిలాబాద్, నేడు వరంగల్ జిల్లాను హడలెత్తిస్తున్న పెద్దపులి - దండోరాతో ప్రజలకు జాగ్రత్తలు
Warangal News | మొన్నటివరకూ ఆదిలాబాద్ జిల్లాను పెద్దపులి హడలెత్తించింది. ప్రస్తుతం వరంగల్ జిల్లాలో పులి సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. దండోరా వేయించి ప్రజలకు జాగ్రత్తలు చెప్పారు.
వరంగల్: మొన్నటివరకూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో పెద్దపులి సంచారం కలకలం రేపింది. రెండు చోట్ల మనుషులపై దాడులు సైతం జరగగా, ఓ ఘటనలో వ్యక్తి మృతి చెందగా.. మరోచోట తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. తాజాగా
ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులను పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. పెద్దపులి సంచారంపై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అక్కడికి వెల్లి పరిశీలించి పులి సంచారం నిజమేనని తేల్చారు. పులి పాదముద్రలు గుర్తించిన తరువాత పులి సంచారంపై అధికారులు స్పష్టతనిచ్చారు.
పెద్దపులి సంచారంతో స్థానికుల్లో భయాందోళన
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామ శివారు పంట చేనులో పెద్దపులి అడుగులను రైతులు గమనించారు. ఉదయం రైతు మంకయ్యతో పాటు వ్యవసాయ పనులకు వెళ్లిన వెళ్ళడంతో మిర్చి తోటలో పెద్దపులి అడుగుజాడలు కనబడటంతో రైతులు ఉలిక్కిపద్దారు. విషయాన్ని గ్రామస్థులకు తెలియజేశారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించడంతో ఎఫ్ అర్ అర్ ఓ రవికిరణ్ ఆధ్వర్యంలో ఫారెస్ట్ అధికారులు పులి పాదముద్రలు పరిశీలించి పులి సంచారం నిజమని తేల్చారు. నల్లబెల్లి మండలం కొండాపురం, రుద్రగూడెం, గుంటూరు పల్లె పరిసర ప్రాంతాల్లో పులుల సంచారం ఉన్నందున రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎఫ్ఎస్ఆర్ఓ రవికిరణ్ తెలిపారు. సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారే వరకు రైతులు పంట చేనులోకి వెళ్లొద్దని సూచించారు. ఒంటరిగా కూడా వెళ్లొద్దని కోరారు. అంతేకాకుండా రుద్రగూడెం గ్రామంలో పులి సంచరిస్తుంది ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలాలని దండోరా వేయించారు.
అయితే 15 రోజులుగా ములుగు జిల్లా వెంకటాపురం, మంగపేట మండలాల పరిధిలో పెద్దపులి సంచరిస్తుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో ఏజెన్సీ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పులి సంచారంపై ఫారెస్ట్ అధికారులు తర్జన భర్జన పడ్డారు. రెండు రోజుల క్రితంపులి సంచారం పై ఎలాంటి నిజం లేదని రేంజర్ చంద్రమౌళి చెప్పారు.
Also Read: Formula E Race Case: అప్పటివరకూ కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దు, హైకోర్టులో మరోసారి ఊరట