Gabriel Attal: ఫ్రాన్స్‌కు తొలి గే ప్రధానిగా గాబ్రియేల్ అటల్
France Prime Minister: ఫ్రాన్స్ నూతన ప్రధానిగా గాబ్రియేల్ అట్టల్ నియమితులయ్యారు. ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ కార్యాలయం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
Gabriel Attal Becomes France PM: ఫ్రాన్స్ నూతన ప్రధానిగా గాబ్రియేల్ అటల్ (Gabriel Attal) నియమితులయ్యారు. ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ (Emmanuel Macron) అటల్‌ను ప్రధానిగా నియమించారు. ఈ మేరకు మంగళవారం మెక్రాన్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘గాబ్రియేల్ అట్టల్‌ను ప్రధాన మంత్రిగా నియమించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బాధ్యతను అధ్యక్షుడు ఆయనకు అప్పగించారు’ అని ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో అతి చిన్న వసులో ప్రధాని అయిన వ్యాక్తిగా గాబ్రియేల్ రికార్డుకెక్కారు. అని మెక్రాన్ కార్యాలయం మంగళవారం ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆయనకు వీవీఐపీల నుంచి ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కాగా గాబ్రియేల్ అటల్ స్వలింగ సంపర్కుడు (గే).
కాగా తన ప్రత్యర్థి మారిన్ లే పెన్స్ ముందు ఎమ్మాన్యుయెల్ మెక్రాన్ ప్రజాదరణ కోల్పోయారు. ఆయన ప్రజాదరణ పది నుంచి నుంచి ఎనిమిది శాతానికి పడిపోయింది. ఇటీవలి ఒపీనియన్ పోల్స్‌లో గ్యాబ్రియెల్ పాపులారిటీ క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జూన్‌లో జరిగే ఈయూ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ప్రభావాన్ని అధిగమించేందుకు గ్యాబ్రియెల్ అటల్‌ను ప్రధానిగా నియమించినట్లు తెలుస్తోంది. కొవిడ్ మహమ్మారి వేళ అటల్ ప్రభుత్వ అధికార ప్రతినిధిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
వివాదం ఇదే
విదేశీయులను బహిష్కరించే విషయంలో ఆ దేశం తీసుకొచ్చి ఇమ్మిగ్రేషన్ చట్టంపై ఇటీవలి రాజకీయ గందరగోళం ఏర్పడింది. దీంతో ప్రధానిగా ఉన్న ఎలిసబెత్ బోర్న్ సోమవారం రాజీనామా చేశారు. ఆ రాజీనామాను ఆమోదించిన వెంటనే మెక్రాన్.. కొత్త ప్రధానిగా అట్టల్ పేరును ప్రకటించారు. అట్టల్ ఇప్పటివరకు మెక్రాన్ హయాంలో ప్రభుత్వ ప్రతినిధిగా, బడ్జెట్ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా పనిచేసి అత్యంత ప్రజాదరణ పొందారు. దీంతోపాటు దేశంలో అత్యంత పవర్ ఫుల్ పదవి చేపట్టనున్న తొలి గే కావడం విశేషం.
అనుకోని అవకాశం
ఎలిజబెత్ బోర్న్ రెండు సంవత్సరాల కంటే తక్కువ కాలమే ప్రధాని పదవిలో ఉన్నారు. మరికొన్ని రోజుల్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కార్యక్రమం ఉండగా ఇమ్మిగ్రేషన్ చట్టంపై వివాదంతో ఆయన రాజీనామా చేశారు. దాంతో, ఫ్రాన్స్ ప్రధానిగా గాబ్రియేల్ అటల్‌ను నియమించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బాధ్యతను ఆయనకు అప్పగించారు. ఈ మేరకు గాబ్రియేల్ అటల్‌కు ఫ్రాన్స్ రినాయజెన్స్ పార్టీ నాయకుడు సిల్వైన్ మైలార్డ్ అభినందనలు తెలిపారు. ‘మీరు మీ బాధ్యతలను సమర్దవంతంగా నిర్వహించగలరని, దేశ విలువలను ప్రతిబింబించగలరని నేను భావిస్తున్నాను’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
గాబ్రియేల్ అటల్ ఎవరు?
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు గాబ్రియేల్ అటల్ అత్యంత సన్నిహితుడు. ఆయనకు సంబంధించిన విషయాలను అటల్ దగ్గరుండి చూసుకుంటారు. ఇటీవలి ఒపీనియన్ పోల్స్‌లో దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన రాజకీయ నాయకుల్లో ఒకరుగా నిలిచారు. పార్లమెంట్‌లో, రేడియో షోలలో సమర్ధవంతమైన వక్తగా పేరుగాంచారు. ఫ్రాన్స్‌కు అత్యంత పిన్న వయసులో ప్రధానిగా నియమితులయ్యారు. అలాగే తొలి గే ప్రధానిగా నిలిచారు.