Vishnupriya Latest News: నిమిషానికి 90 వేలు- బెట్టింగ్ యాప్ గుట్టు విప్పిన యాంకర్ విష్ణుప్రియ
Vishnupriya Latest News: బెట్టింగ్ యాప్ ప్రమోషన్‌కు యాంకర్ విష్ణుప్రియ నిమిషానికి 90 వేలు వసూలు చేసినట్టు పోలీసుల ఎదుట అంగీకరించారు.

Vishnupriya Latest News: కొంత కాలంగా వివాదాలకు కేంద్రంబిందువుగా ఉన్న బెట్టింగ్ యాప్స్ కేసులో పోలీసుల విచారణకు యాంకర్ విష్ణు ప్రియ హాజరయ్యారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కోసం ఎంత వసూలు చేస్తున్నారో వివరించారు. ఈ క్రమంలో జరిగిన లావాదేవీల వివరాలను కూడా పోలీసుల ముందు ఉంచారు.
ప్రజల ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌కు ఎంత ఖర్చు చేస్తున్నారో తెలిస్తే షాక్ అవుతారు. ఇదే విషయంపై పంజాగుట్ట పోలీసులకు యాంకర్ విష్ణుప్రియ షాకింగ్ నిజాలు చెప్పారు. ఆ వివరాలు తెలుసుకున్న పోలీసులే ఖంగుతున్నారు. ఇంతలా ఖర్చు చేస్తున్నారంటే వాళ్లు ఏ స్థాయిలో దందాలు చేస్తున్నారో అర్థం చేసుకోవాలని ప్రజలకు హితవు పలుకుతున్నారు.
ప్రజలను నిట్టనిలువునా దోచేస్తూ వారి ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్ యాప్స్ భరతం పట్టేందుకు కంకణం కట్టుకున్న పోలీసులు కీలక విషయాలు రాబడుతున్నారు. ఇప్పటికే 11 మంది సెలబ్రెటీలకు నోటీసులు జారీ చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన కేసులో నోటీసులు అందుకున్న వారంతా ఒక్కొక్కరుగా పోలీసు విచారణకు వస్తున్నారు. తాజాగా యాంకర్ విష్ణుప్రియ పోలీసు విచారణకు హాజరయ్యారు.
పంజాగుట్ట పోలీసు స్టేషన్‌కు తన లాయర్‌తో కలసి వచ్చిన విష్ణుప్రియ పోలీసులు అడిగిన సమాచారం అందజేశారు. ఆమెను క్వశ్చన్ చేసిన ఖాకీలు స్టేట్మెంట్ రిక్రాడు చేశారు. ఈ సందర్భంగా కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. తాను 15 బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినట్టు విష్ణుప్రియ పోలీసులకు వివరించారు. నిమిషం వ్యవధితో చేసే ఒక్కో వీడియోకు రూ.90 వేల వరకు వసూలు చేసినట్టు పేర్కొన్నారు.
దాదాపు మూడు గంటలకుపైగా సాగిన విచారణలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్‌లో భాగంగా భారీగా డబ్బులు వచ్చినట్టు విష్ణుప్రియ అంగీకరించినట్టు సమాచారం. దీనికి సంబంధించిన బ్యాంకు లావాదేవీల వివరాలు వారికి అందజేశారు. కేసు దర్యాప్తులో భాగంగా మరింత లోతుగా విచారించేందుకు పోలీసులు ఆమె ఫోన్ కూడా సీజ్ చేశారని తెలుస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

