News
News
వీడియోలు ఆటలు
X

Upasana on Mothers Day: వారసత్వం కోసమో, వివాహం కోసమో కాదు... మానసికంగా సిద్ధమైన తర్వాతే - ఉపాసన మదర్స్ డే పోస్ట్

Ram Charan's Wife post On Mother's Day: ప్రముఖ ఎంట్రప్రెన్యూర్, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల మదర్స్ డే సందర్భంగా ఓ పోస్ట్ చేశారు.

FOLLOW US: 
Share:

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి, ప్రముఖ ఎంట్రప్రెన్యూర్ ఉపాసన కామినేని కొణిదెల (Upasana Kamineni Konidela) దంపతులకు కొన్ని నెలల క్రితం వరకు ఓ ప్రశ్న ఎదురవుతూ ఉండేది. ఎప్పుడు తల్లిదండ్రులు అవుతారు? అని! వివాహమై ఇన్నాళ్ళైనా ఇంకా పిల్లలు లేకపోవడం ఏమిటి? అని కామెంట్స్ చేసిన వ్యక్తులూ ఉన్నారు. మదర్స్ డే సందర్భంగా బేబీ బంప్ ఫోటోను ఉపాసన పోస్ట్ చేశారు. ఆ ఫోటోకు ఇచ్చిన క్యాప్షన్ చూస్తే.... కామెంట్స్ & విమర్శలకు సమాధానం చెప్పినట్టు ఉందనుకోవాలి. 

మానసికంగా సిద్ధంగా ఉన్నాను...
అందుకే ఇప్పుడు గర్భవతి అయ్యా!
Upsana Post On Mother's Day 2023 : ఇప్పుడు తానూ మాతృత్వపు మధురిమను ఆస్వాదిస్తున్నాని, తల్లి కాబోతున్నందుకు తనకు ఎంతో గర్వంగా ఉందని ఉపాసన పేర్కొన్నారు. ఇంకా ఆమె మాట్లాడుతూ ''సమాజం ఏదో అనుకుంటుందని లేదా వాళ్ళ అంచనాలు అందుకోవాలని నేను గర్భవతి కాలేదు. మా వివాహ బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి లేదంటే వారసత్వాన్ని కొనసాగించాలనే కోరికతోనో ప్రెగ్నెంట్ కావాలనే నిర్ణయాన్ని తీసుకోలేదు. నేను మానసికంగా సిద్ధమైన తర్వాత, నా బిడ్డకు ఎటువంటి అవధులు లేని ప్రేమను ఇవ్వగలనని, జాగ్రత్తగా బిడ్డను చూసుకోగలనని అనుకున్న తర్వాత జన్మ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను'' అని తెలిపారు. 

Also Read పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ బైక్స్ & కారుకు సేమ్ నంబర్, సమంత కారుకూ... హరీష్ శంకర్ 2425 సెంటిమెంట్!

View this post on Instagram
 
A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)

విషెష్ చెప్పిన సామ్, కాజల్!
ఉపాసనకు స్టార్ హీరోయిన్లు సమంత, కాజల్ అగర్వాల్, సంయుక్తా మీనన్, ఇంకా కొరియోగ్రాఫర్ యానీ మాస్టర్ తదితరులు మదర్స్ డే విషెష్ చెప్పారు.

Also Read వెంకీతో దుల్కర్ సల్మాన్ - అక్టోబర్‌లో సెట్స్‌కు, సమ్మర్‌లో థియేటర్లకు!

దుబాయ్‌లో ఉపాసన సీమంతం
రామ్ చరణ్, ఉపాసన దంపతులు కొన్ని రోజుల క్రితం దుబాయ్‌లో ఉన్నారు. అతి కొద్ది మంది కుటుంబ స‌భ్యులు, కొంత మంది సన్నిహిత మిత్రుల సమక్షంలో ఉపాసన సీమంతం వేడుకలు జరిగాయి. ఉపాసన సోద‌రి అనుష్పాల కామినేని, సింధూరి రెడ్డి ఈ వేడుకను నిర్వ‌హించారు.

ఉపాసన అమ్మమ్మ కూడా...
ఉపాసన సీమంతం వేడుకకు ఆమె అమ్మమ్మ, డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి భార్య సుచరితా రెడ్డి కూడా పాల్గొన్నారు. హుందాగా క‌నిపించి అంద‌రి హృద‌యాల‌ను ఆమె దోచుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీమంతం వేడుక వీడియో షేర్ చేశారు ఉపాసన

బేబీ బంప్‌తో కనబడుతున్న ఉపాసన
ఆస్కార్ వేడుకల నుంచి ఉపాసనను గమనిస్తే... బేబీ బంప్‌తో కనబడుతున్నారు. ఆ మధ్య జరిగిన రామ్ చరణ్ బర్త్ డే (Ram Charan Birthday) ఫొటోల్లోనూ ఉపాసన బేబీ బంప్ హైలైట్ అయ్యింది.రామ్ చరణ్ పుట్టిన రోజున ఉపాసన వేసుకున్న డ్రస్ చూశారా? బ్లూ కలర్ డ్రస్ ధరించారు. అందులో బేబీ బంప్ చాలా క్లారిటీగా కనిపించింది. దీంతో ఉపాసన ప్రెగ్నెన్సీపై అనుమానులు అన్నీ క్లియర్ అవుతాయని చెప్పవచ్చు. రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన (Upasana) వివాహం ఎప్పుడు జరిగిందో గుర్తు ఉందా? జూన్ 14, 2012లో వాళ్ళిద్దరి పెళ్లి జరిగింది. వివాహమైన పదకొండేళ్లకు వాళ్లిద్దరూ తల్లిదండ్రులు కానున్నారు. అపోలో ఆస్పత్రిలో ఇక్కడి వైద్యులతో పాటు కొంత మంది విదేశీ వైద్యుల పర్యవేక్షణలో డెలివరీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

Published at : 14 May 2023 11:29 AM (IST) Tags: Upasana Kamineni Konidela Ram Charan Upasana Mothers Day Upsana On Motherhood

సంబంధిత కథనాలు

NBK 109 Movie : మారణాయుధాలతో పాటు మందు బాటిల్ - బాలకృష్ణతో బాబీ ప్లాన్ ఏంటి?

NBK 109 Movie : మారణాయుధాలతో పాటు మందు బాటిల్ - బాలకృష్ణతో బాబీ ప్లాన్ ఏంటి?

Thalaivar 170 : తమిళ సినిమాలో అమితాబ్ బచ్చన్ - 32 ఏళ్ళ తర్వాత రజనీతో!

Thalaivar 170 : తమిళ సినిమాలో అమితాబ్ బచ్చన్ - 32 ఏళ్ళ తర్వాత రజనీతో!

Ram Charan Shirt Cost : శర్వా రిసెప్షన్‌లో రామ్ చరణ్ వేసుకున్న షర్ట్ రేటు ఎంతో తెలుసా?

Ram Charan Shirt Cost : శర్వా రిసెప్షన్‌లో రామ్ చరణ్ వేసుకున్న షర్ట్ రేటు ఎంతో తెలుసా?

Lavanya Tripathi Relationship : ఎంగేజ్మెంట్ ఫోటోలను షేర్ చేస్తూ లావణ్య పెట్టిన క్యాప్షన్ వెనుక ఇంత కథ ఉందా?

Lavanya Tripathi Relationship : ఎంగేజ్మెంట్ ఫోటోలను షేర్ చేస్తూ లావణ్య పెట్టిన క్యాప్షన్ వెనుక ఇంత కథ ఉందా?

Lavanya Tripathi: అల్లు అరవింద్ మాటలను నిజం చేసిన లావణ్య, వైరల్ అవుతున్న ఓల్డ్ వీడియో!

Lavanya Tripathi: అల్లు అరవింద్ మాటలను నిజం చేసిన లావణ్య, వైరల్ అవుతున్న ఓల్డ్ వీడియో!

టాప్ స్టోరీస్

Telangana News : కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయించుకున్న మంత్రి !

Telangana News :  కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయించుకున్న మంత్రి !

Tirupati News : శ్రీవారి సేవలో బీజేపీ అగ్రనేతలు - కాళహస్తి బహిరంగసభకు భారీ ఏర్పాట్లు

Tirupati News :  శ్రీవారి  సేవలో బీజేపీ అగ్రనేతలు -  కాళహస్తి బహిరంగసభకు భారీ ఏర్పాట్లు

జగన్‌ను చూసి నేర్చుకో- చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్ సెటైర్లు

జగన్‌ను చూసి నేర్చుకో- చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్ సెటైర్లు

Pawan Kalyan At Varun Tej Lavanya : అబ్బాయ్ ఎంగేజ్‌మెంట్‌లో బాబాయ్ పవర్‌ఫుల్ ఎంట్రీ - పవన్, చరణ్ ఫోటోలు చూశారా?

Pawan Kalyan At Varun Tej Lavanya : అబ్బాయ్ ఎంగేజ్‌మెంట్‌లో బాబాయ్ పవర్‌ఫుల్ ఎంట్రీ - పవన్, చరణ్ ఫోటోలు చూశారా?