Crime News: వీళ్లసలు పేరెంట్స్‌యేనా - నాలుగేళ్ల కుమార్తెకు తల్లి వాతలు, కొడుకుని కొట్టి దెబ్బలపై కారం పెట్టిన తండ్రి, ఏపీలో దారుణాలు
Andhra News: పేరెంట్స్ పిల్లల పట్ల కర్కశంగా ప్రవర్తించారు. ఓ మహిళ తన నాలుగేళ్ల కుమార్తె బుగ్గలపై అట్లకాడతో వాతలు పెట్టింది. ఓ మారు తండ్రి బాలుడిపై ఛార్జర్ వైరుతో దాడి చేసి గాయాలపై కారం పూశాడు.

Woman Tortured Four Years Old Child In Palnadu District: ఏపీలో దారుణాలు చోటు చేసుకున్నాయి. కంటికి రెప్పలా కాపాడాల్సిన తన బిడ్డపైనే ఓ తల్లి కర్కశంగా ప్రవర్తించింది. సహజీవనం పెట్టుకున్న వ్యక్తి ఇంటికి వచ్చి వెళ్తుండగా చిన్నారి ఏడుస్తోందని అట్లకాడతో పాప బుగ్గలపై వాతలు పెట్టింది. ఈ ఘటన పల్నాడు జిల్లా (Palnadu District) సత్తెనపల్లిలో సంచలనం రేకెత్తించింది. అటు, ఏలూరు జిల్లాలో ఓ మారు తండ్రి కొడుకుని కొట్టి గాయాలపై కారం చల్లాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన మాధవి అనే మహిళ ఇళ్లల్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద తన నాలుగేళ్ల కుమార్తెతో కలిసి జీవిస్తోంది. భర్త లేకపోవడంతో అదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తితో సహజీవనం సాగిస్తోంది.
అతను ఇంటికొస్తే ఏడుస్తోందని..
అయితే, గత కొద్ది రోజులుగా పాప బయటకు రాకపోవడాన్ని స్థానికులు గుర్తించారు. ఏం జరిగిందోనని ఆరా తీయగా.. చిన్నారి బుగ్గలపై వాతలను గమనించారు. దీంతో అధికారులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి తల్లిని నిలదీశారు. ఈ క్రమంలో కుమార్తెను వారి కంట పడకుండా దాచిపెట్టిన మాధవి.. తనకు అసలు కుమార్తే లేదని చెప్పింది. అధికారులు తిరిగి వెళ్లినట్లే వెళ్లి వెనక్కి వచ్చి ఇంటిని పరిశీలించారు. చిన్నారి బుగ్గలపై వాతలుండడంతో తల్లిని ప్రశ్నించారు. గత 5 రోజులుగా తల్లి వాతలు పెడుతున్నట్లు చిన్నారి అధికారులకు చెప్పింది. మాధవి సహజీవనం చేస్తోన్న వ్యక్తి అప్పుడప్పుడూ ఇంటికి వచ్చి వెళ్తాడని.. ఆ సమయంలో చిన్నారి గోల చేస్తుండడాన్ని భరించలేని ఆమె.. చిన్నారికి వాతలు పెట్టినట్లు అధికారులు గుర్తించారు.
చిన్నారిని గదిలో నిర్బంధించి వాతలు పెడుతూ పైశాచికత్వం చూపినట్లు తెలిపారు. పాపను రక్షించిన ఐసీడీఎస్ అధికారులు నర్సరావుపేట కేంద్రానికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అధికారుల నుంచి వివరాలు సేకరించి మాధవిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చిన్నారిని హింసించిన ఘటనలో మాధవితో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తికి ఏమైనా ప్రమేయం ఉందా.? అనే కోణంలోనూ విచారిస్తున్నారు.
కొడుకుని కొట్టి గాయాలపై కారం..
అటు, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోనూ (Jangareddygudem) దారుణం జరిగింది. ఓ బాలుడిపై మారు తండ్రి విచక్షణారహితంగా ప్రవర్తించాడు. ఛార్జర్ వైరుతో బాలుడిని చితకబాది ఆ గాయాలపై కారం పూశాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలుడి తల్లి శారద పదేళ్ల క్రితం గణేష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని గొడవల కారణంగా మూడేళ్ల క్రితం విడిపోయింది. అనంతరం గతేడాదిగా పవన్ అనే వ్యక్తితో సహజీవనం సాగిస్తోంది. అయితే, పిల్లలు అల్లరి చేస్తున్నారనే నెపంతో పవన్ వారిని చిత్రహింసలు పెట్టాడు. శనివారం రాత్రి మద్యం మత్తులో బాలుడు రాహుల్‌పై మరోసారి ఛార్జర్ వైర్‌తో దాడి చేశాడు. ఆ గాయాలపై కారం చల్లాడు. బాలుడి పరిస్థితి గమనించిన స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. గత కొంతకాలంగా తమను మారు తండ్రి చిత్రహింసలు పెడుతున్నాడని పిల్లలు ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: Crime News: యువతి స్నానం చేస్తుండగా వీడియో తీసిన యువకుడు - బంధించిన యువతి కుటుంబసభ్యులు, చివరకు!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

