Crime News: యువతి స్నానం చేస్తుండగా వీడియో తీసిన యువకుడు - బంధించిన యువతి కుటుంబసభ్యులు, చివరకు!
Visakha News: పక్కింటి యువతిని వీడియో తీసిన ఓ యువకుడిపై ఆమె బంధువులు దాడి చేసి గదిలో నిర్బంధించారు. అవమాన భారంతో సదరు యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన విశాఖలో జరిగింది.

Young Man Forceful Death In Visakhapatnam: పక్కింటి యువతి స్నానం చేస్తుండగా ఓ యువకుడు వీడియో తీయడంతో అతనిపై ఆమె బంధువులు దాడి చేశారు. అనంతరం గదిలో పెట్టి నిర్బందించగా.. అవమాన భారంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2 కుటుంబాల్లో విషాదం నింపిన ఈ ఘటన విశాఖ జిల్లాలో (Visakha District) చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా పూల్‌బాగ్ ప్రాంతానికి చెందిన గొందేటి తాతారావు, పార్వతి దంపతులకు ముగ్గురు సంతానం. రెండో కుమారుడు గొందేటి భాస్కరరావు (30) విశాఖ ఫార్మాసిటీలోని ఓ కంపెనీలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. గాజువాక శ్రీనగర్ సమీప శ్రీరాంనగర్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు.
యువతిని వీడియో తీశాడు
శనివారం ఉదయం పక్కింటి యువతి స్నానం చేస్తుండగా భాస్కరరావు వీడియో తీశాడు. ఇది గమనించిన యువతి కేకలు వేస్తూ కుటుంబసభ్యులకు చెప్పింది. దీనిపై వారు భాస్కరరావును నిలదీస్తూ అతనిపై దాడి చేసి వీడియో డిలీట్ చేయించారు. అంతటితో ఆగకుండా అతని తల్లిదండ్రులను పిలిపించి నీ సంగతి తేలుస్తామంటూ బెదిరించారు. అనంతరం అతన్ని ఓ గదిలో పెట్టి తాళం వేశారు. విజయనగరంలోని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు వైజాగ్ వచ్చి తలుపులు తెరిచి చూడగా భాస్కరరావు గదిలో సీలింగ్ ఫ్యానుకు ఉరి వేసుకుని కనిపించాడు. దీంతో వారు షాక్ అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తన కుమారుడి ముఖంపై గాయాలున్నాయని.. కావాలనే తన కుమారుడిని కొట్టి చంపేశారని భాస్కరరావు తల్లిదండ్రులు ఆరోపించారు.
వారి ఫిర్యాదు మేరకు పోలీసులు.. యువతి సహా నలుగురు కుటుంబసభ్యులపైనా కేసులు నమోదు చేశారు. గాయపరచడం, గదిలో నిర్బంధించడం నేరమని.. అందుకే ఘటనకు కారణమైన ఐదుగుర్ని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Also Read: Tirumala Stampede: తిరుమలలో తొక్కిసలాట జరిగిన స్థలాన్ని పరిశీలించిన విచారణ కమిటీ సభ్యులు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

