అన్వేషించండి

Vrishabha Rasi Ugadi Rasi Phalalu In Telugu: ఏప్రిల్ 2025 నుంచి మార్చి 2026 వరకూ విశ్వావసు నామ సంవత్సర వృషభ రాశి నెలవారీ ఫలితాలు!

Vrishabha Rasi Ugadi Rasi Phalalu 2025-2026: శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఏప్రిల్ 2025 నుంచి మార్చి 2026 వరకూ నెలవారీ ఫలితాలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి..

Vrishabha  Rasi Ugadi Panchangam 2025 April to 2026 March :  శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వృషభ రాశి మాస ఫలితాలు...

వృషభ రాశి  ( కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర మొదటి 2 పాదాలు)
ఆదాయం : 11 వ్యయం : 5 రాజ్యపూజ్యం : 1 అవమానం : 3

ఏప్రిల్ 2025 

ఈనెలలో మొదటి రెండు వారాలు యోగదాయకంగా ఉంటుంది. అన్ని రంగాలవారికీ లాభమే. చేసే వృత్తివ్యాపారాలు అనుకూలిస్తాయి. ఆదాయం బాగుంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. చివరి రెండు వారాలు కొన్ని సమస్యలు తలెత్తుతాయి. అనుకోని ఖర్చులుంటాయి. ఆరోగ్యం సహకరించదు. విరోధాలుంటాయి. శత్రువుల వల్ల భయం ఉంటుంది.
 
మే 2025

విశ్వావసు నామ సంవత్సరం మే నెలలో వృషభ రాశివారికి మిశ్రమ ఫలితాలుంటాయి. అనారోగ్య సమస్యలుంటాయి. అకారణ విరోధాలు,  మనఃస్థిమితం ఉండదు. ఆదాయం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు కలిసొస్తాయి. శత్రువులపై పైచేయి సాధిస్తారు. నెల ఆరంభంలో కన్నా చివర్లో దూరప్రయాణాలుంటాయి. అన్నింటా విజయం సాధిస్తారు

జూన్ 2025

ఈ నెల మీకు కొంత చికాకుగానే ఉంటుంది. గాయాలు, వాహనప్రమాదాలు, కుటుంబంలో సమస్యలు, అనుకోని ఖర్చులుంటాయి. నెల మధ్యలో పరిస్థితులు సర్దుమణుగుతాయి. వృత్తి వ్యాపారాలు కలిసొస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతానం కారణంగా సంతోషంగా ఉంటారు. 

Also Read: వృషభ రాశి ఉగాది ఫలితాలు - ఈ ఏడాది మీ ప్రతి అడుగు బ్లాక్ బస్టరే ..పట్టిందల్లా బంగారమే!
 
జూలై 2025
 
వృషభ రాశివారికి జూలైలో గ్రహాల అనుకూల సంచారంవల్ల అన్నిరంగాలవారికి అనుకూలమే. ఆదాయంబాగుంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. శుభవార్తలు వింటారు. శత్రువులపై పైచేయి సాధిస్తారు. బంధుమిత్రులను కలుస్తారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు.

ఆగష్టు 2025 

ఈ నెలలోనూ మంచి ఫలితాలుంటాయి. వృత్తి వ్యాపారాల్లో అనుకూల ఫలితాలుంటాయి. వాన సౌఖ్యం ఉంటుంది. శత్రువులపై పైచేయి సాధిస్తారు. గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులు శుభవార్తలు వింటారు.
 
సెప్టెంబర్ 2025
 
సెప్టెంబర్ అన్ని విధాలుగా కలిసొస్తుంది. అన్ని రంగాలవారికీ లాభమే. ఆరోగ్యం బావుంటుంది. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. శత్రువులపై ఆధిక్యత సాధిస్తారు. వ్యాపారంలో లాభాలుంటాయి. సమస్యలన్నీ తీరిపోతాయి. 

Also Read: ఏప్రిల్ 2025 నుంచి మార్చి 2026 వరకూ విశ్వావసు నామ సంవత్సర మేష రాశి నెలవారీ ఫలితాలు!

అక్టోబర్ 2025

గ్రహాల అనుకూల సంచారం కారణంగా అన్ని రంగాలవారికి మంచి ఫలితాలుంటాయి. చేసే ప్రయత్నాలన్నీ సక్సెస్ అవుతాయి. దైవ దర్శనం చేసుకుంటారు. పెద్దలతో పరిచయాలు లాభిస్తాయి. ఇంట్లో సంతోషం ఉంటుంది. సంతానం ద్వారా లాభపడతారు. 

నవంబర్ 2025

అన్నింటా మీదే పైచేయి అవుతుంది. కుటుంబ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. స్నేహితులను కలుస్తారు. తల్లి కుటుంబం నుంచి సూతకం ఉండొచ్చు. శత్రువులపై పైచేయి సాధిస్తారు. మీ శక్తి సామర్థ్యాల వల్ల కొన్ని పనులు పూర్తిచేస్తారు.  

డిసెంబర్ 2025

గడిచిన నెలల కన్నా ఈ నెలలో కొంత అనుకూలత తగ్గుతుంది. చేపట్టిన పనులు మధ్యలోనే ఆగిపోతాయి. ఆర్థిక సమస్యలుంటాయి. నమ్మినవారే మోసం చేస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. శారీరక శ్రమ ఉంటుంది. బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి. 8వ స్థానంలో కుజుడి ప్రభావం వల్ల ఊహించని సంఘటనలు జరుగుతాయి.

Ugadi Panchangam in Telugu (2025-2026): శ్రీ విశ్వావసు నామ సంవత్సర మేషరాశి ఫలితాలు - గురు, శని గ్రహాలు మిమ్మల్ని అంతెత్తున కూర్చోబెడతాయ్!

జనవరి 2026 
 
నూతన సంవత్సరంలో ఆరంభం వృషభ రాశివారికి ధనలాభం ఉంటుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. అయితే బంధుమిత్రులతో విరోధాలుంటాయి.అష్టమ గ్రహ సంచారం చికాకులు కలిగిస్తుంది. 

ఫిబ్రవరి 2026

ఈ నెలలో శారీరకశ్రమ అధికమైనా ఆదాయం బాగుంటుంది. అకాలభోజనం, క్షణం తీరికలేకుండా ఉంటుంది. ఆరోగ్యం బావుంటుంది. అనుకున్న పనులన్నీ పూర్తిచేసేస్తారు. ఇల్లు మారటం తప్పదు. ఉద్యోగులకు శుభసమయం.

మార్చి 2026

ఈ నెలలో గ్రహాల అనుకూల సంచారంతో మీ మాటకు తిరుగుండదు. పట్టిందల్లా బంగారమా అన్నట్టుంటుంది. నూతన వ్యవహారాలు కలిసొస్తాయి. ఆదాయం ,ఆరోగ్యం, సంతోషం అన్నీ బావుంటాయి. అనుకోని ధనం చేతికందుతుంది.

 Also Read: 2025లో ఉగాది ఎప్పుడొచ్చింది - రాబోతున్న తెలుగు నూతన సంవత్సరం పేరు తెలుసా!

మీ నక్షత్రం ఏంటో తెలియకపోతే...మీ పేరులో మొదటి అక్షరం ఆధారంగా మీ నక్షత్రం తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి...

 ఏబీపీ దేశం వ్యూయర్స్ అందరకీ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం శుభాకాంక్షలు 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
Embed widget