Mahesh Babu: మహేష్ బాబు సినిమాకు రెండు వేర్వేరు క్లైమాక్స్‌లు.. షాక్‌లో సూపర్‌స్టార్ ఫ్యాన్స్, ఎందుకో తెలుసా?
మహేష్ బాబు సినిమాకు రెండు వేరు వేరు క్లైమాక్స్ లు షూట్ చేశారని తెలుసా? రోమియో జూలియట్ ఆధారంగా సూపర్‌స్టార్ నటించిన లవ్ ట్రాజడీ సినిమాకు మొదట ఒక క్లైమాక్స్ అనుకున్నా అభిమానుల కోరిక మేరకు మార్చారు.

బాలీవుడ్‌లో 'క్రేజ్ XY ' అనే సినిమా రిలీజ్ అయింది. 'తుంబాడ్ ' లాంటి కల్ట్ క్లాసిక్ తీసిన సోహమ్ షా నుండి వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమాకి క్రేజ్ బానే ఉంది. రివ్యూస్ బానే వచ్చినా క్లైమాక్స్ మాత్రం బాలేదని అనడంతో కొత్త క్లైమాక్స్ యాడ్ చేశారు. దీన్ని ఒక బోల్డ్ స్టెప్ గా బాలీవుడ్ మీడియా పొగుడుతోంది. కానీ చాలా ఏళ్ల క్రితమే ప్రిన్స్ మహేష్ బాబు తన సినిమాకు ఇలా రెండు క్లైమాక్స్ లు షూట్ చేసిన విషయం ఇప్పటి జనరేషన్ కు తెలియదు. ఆ సినిమా పేరే 'బాబి'
'బాబీ ' సినిమాకు రెండు క్లయిమాక్స్‌లు
మహేష్ బాబు, ఆర్తి అగర్వాల్ జంటగా శోభన్ దర్శకత్వంలో వచ్చింది ' బాబీ ' సినిమా (2002లో). అప్పటికి యూత్లో ఫుల్ క్రేజ్ లో ఉన్న మహేష్, ఆర్తి తొలిసారి నటిస్తుండడం, మహేష్ తొలిసారి నటించిన పూర్తిస్థాయి లవ్ స్టోరీ అని ప్రచారం చెయ్యడంతో భారీ అంచనాల మధ్య ఈ సినిమా రిలీజ్ అయింది. మణిశర్మ మ్యూజిక్ రిలీజ్ కు ముందే సూపర్ హిట్. ప్రకాష్ రాజ్, రఘువరన్, బ్రహ్మానందం, సునీల్, రవిబాబు ఇలా భారీ కాస్టింగ్ ఉన్న సినిమా ఇది.'టక్కరి దొంగ ' లాంటి కౌబాయ్ మూవీ తరువాత మహేష్ నుండి వస్తున్న మూవీ కావడం తో ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు.
అయితే సినిమా రిలీజ్ అయ్యాక ఫ్యాన్స్ అందరూ థియేటర్లో షాక్ కి గురయ్యారు. ఎందుకంటే క్లైమాక్స్ లో మొత్తం అందరూ చనిపోతారు. హీరో మహేష్ బాబు, హీరోయిన్ ఆర్తి అగర్వాల్ కూడా పోలీస్ కాల్పుల్లో చనిపోవడంతో సినిమా ఎండ్ అయిపోతోంది. ఆ క్లైమాక్స్ ని ఫ్యాన్స్ ఎవరూ భరించలేకపోయారు. మ్యాట్నీ టైం కే వాళ్ళు పెద్ద ఎత్తున గొడవ మొదలుపెట్టడం తో సెకండ్ షో సమయానికి డిజాస్టర్ టాక్ వచ్చేసింది. దానితో ఖంగుతిన్న ప్రొడక్షన్ టీం హడావుడిగా మరో చిన్న సీన్ షూట్ చేసి క్లైమాక్స్ మార్చేశారు. దాని ప్రకారం సినిమాలో ఆర్తి అగర్వాల్ తండ్రి ప్రకాష్ రాజ్ వచ్చి పోలీస్ కాల్పుల్లో గాయపడిన మహేష్ బాబు, ఆర్తి అగర్వాల్ ని హాస్పిటల్ కి తీసుకువెళ్లినట్టు చూపిస్తారు. వాళ్ళిద్దరి పెళ్లితో సినిమాకు శుభం కార్డు వేస్తారు. కానీ ఈ క్లైమాక్స్ కి అంత వరకూ సినిమాలో చూపించిన దానికి సింక్ లేకపోవడం అప్పటికే మహేష్ బాబు ఫ్యాన్స్ బాగా హర్ట్ అయి ఉండడంతో సినిమా రిజల్ట్ మారలేదు. ఈ సినిమా అక్టోబర్ 2002లో రిలీజ్ అయితే మూడు నెలల గ్యాప్ లో జనవరి 2003లో 'ఒక్కడు' రిలీజ్ అయింది. ఆ సినిమా మహేష్ బాబు కెరీర్ ను పూర్తిగా మార్చేసే స్థాయిలో బ్లాక్ బస్టర్ అయింది. ఎప్పటినుంచో మహేష్ నుండి మాస్ సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్న ఫ్యాన్స్ కు 'ఒక్కడు ' ఫుల్ మీల్స్ పెట్టేసింది. ఆ సక్సెస్ తో "బాబీ " గాయాన్ని మర్చిపోయారు ప్రిన్స్ అభిమానులు.
రోమియో -జూలియట్ ఆధారంగా వచ్చిన 'బాబి'
షేక్ స్పియర్ నాటకం 'రోమియో జూలియట్' ఒక పెద్ద సక్సెస్. ఎండింగ్‌లో హీరో హీరోయిన్లు చనిపోయే ఈ కథను మాఫీయా బ్యాగ్రౌండ్ లోకి మార్చి 1961లో 'వెస్ట్ సైడ్ స్టోరీ ' అనే హాలీవుడ్ సినిమా తీశారు. దానినే తమిళంలో నేటివిటికి తగ్గట్టు మార్చి 1996లో అరుణ్ విజయ్, రాశి హీరో హీరోయిన్లుగా 'ప్రియం' అనే సినిమా తీశారు. ఇది రాశి హీరోయిన్ గా వచ్చిన తొలి సినిమా. దీనినే తెలుగు నేటివిటీకి మార్చి మహేష్ తో 'బాబీ' తీశారు. అప్పట్లో మహేష్ బాబు వరుస పెట్టి ప్రయోగాత్మక సినిమాల్లో నటిస్తూ ఉండేవారు. మురారి లాంటి డివోషనల్ థ్రిల్లర్, కౌబాయ్ కథ తో టక్కరి దొంగ, లవ్ ట్రాజడీ బాబీ, సైంటిఫిక్ ఎక్స్పరిమెంట్ నాని ఇవన్నీ ఆ కోవ లో వచ్చినవే. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం లో వస్తున్న SSMB 29 పై అంచనాలు స్కై లెవెల్ ల్లో ఉన్నాయి.
Also Read: డాన్ లీ గారూ... మేం డైనోసార్ తాలూకా - సౌత్ కొరియన్ హీరో పుట్టిన రోజు... ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

