(Source: ECI | ABP NEWS)
Case On Avinash Reddy: వేరే వ్యక్తి భార్యను కాపురానికి పోనివ్వని అవినాష్ రెడ్డి - పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త
Anantapur News: అవినాష్ రెడ్డిపై పోలీసులకు మరో ఫిర్యాదు అందింది. కుటుంబ వివాదాల్లో జోక్యం చేసుకుని తన భార్యను కాపురానికి రాకుండా చేస్తున్నారని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు.

Avinash Reddy: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై అనంతపురం జిల్లా ఎస్పీకి శేషానందరెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. తన కుటుంబ వ్యవహారాల్లో అవినాష్ రెడ్డి జోక్యం చేసుకుని ఇబ్బంది పెడుతున్నారని.. తన భార్యను కాపురానికి రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. రాప్తాడు మండలం ఆకుతోటపల్లికి చెందిన శేషానందరెడ్డి నేరుగా ఎస్పీ జగదీష్ కు ఈ ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేస్తారా లేకపోతే ఆ దంపతులకు కౌన్సెలింగ్ చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.
ఓ కుటంబ సమస్య పరిష్కారానికి ప్రయత్నించిన అవినాష్ రెడ్డి
కడప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి వద్దకు ప్రజలు వ్యక్తిగత సమస్యలు, పంచాయతీలు కూడా తీర్చమని వస్తారు. ఇలా తన నియోజకవర్గ పరిధిలోని ఓ కుటుంబానికి వచ్చిన సమస్య విషయంలో ఆయన జోక్యం చేసుకున్నట్లుగా తెలుస్తోది. శేషానందరెడ్డికి.. ఆయన భార్యకు వచ్చిన వివాదాల్లో ..ఆయన భార్య కుటుంబీకులు అవినాష్ రెడ్డిని సంప్రదిచినట్లుగా చెబుతున్నారు. శేషానందరెడ్డితో కటీప్ చేసుకోవాలని.. విడాకులు తీసుకోవాలని ఆ మహిళ అనుకున్నారని వారికే అవినాష్ రెడ్డి సపోర్టుగా ఉన్నారని అంటున్నారు. ఇది నచ్చని శేషానందరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా చెబుతున్నారు.
భార్యభర్తల మధ్య ఏర్పడిన వివాదంలో పంచాయతీ
బార్య, భర్తల మధ్య ఏర్పడిన వివాదంలో.. తల్లిదండ్రుల కోరిక మేరుక అవినాష్ రెడ్డి జోక్యం చేసుకున్నారు కానీ.. వారి కుటుంబం విషయంలో ఎంపీ ఎలాంటి జోక్యం చేసుకోలేదని ఆయన అనుచరులు అంటున్నారు. శేషానందరెడ్డి బ్లాక్ మెయిల్ చేయడానికే ఫిర్యాదు చేశారని అంటున్నారు. భార్య భర్తల మధ్య గొడవులు ఉండబట్టే ఆయన భార్య .. కాపురానికి రానంటోందని.. దానికి అవినాష్ రెడ్డికేం సంబందం ఉంటుందని అంటున్నారు. తన నియోజకవర్గానికి చెందిన కుటుంబసమస్య విషయంలో సాయం చేసేందుకు మాత్రమే ఆయన ప్రయత్నించారని అంటున్నారు.
ఫిర్యాదుపై పోలీసుల స్పందనపై ఉత్కంఠ
అయితే అవినాష్ రెడ్డిపై నేరుగా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో పోలీసులు తీసుకునే చర్యలపై ఆసక్తి ఏర్పడింది. ఇప్పటికే అవినాష్ రెడ్డి అనేక వివాదాల్లో ఉన్నారు. ముఖ్యంగా వైఎస్ వివేకానందరెడ్డి కేసులో ఆయనపై సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. ప్రతీ వారం కోర్టుకు హాజరవుతున్నారు. అయితే వివాకేను చంపిన వారితో తనకు సంబంధం లేదని.. హంతకుల్ని పట్టుకోవాలనే తాము కూడా చెబుతున్నామని అవినాష్ రెడ్డి చెబుతూ వస్తున్నారు. ఈ కేసు అంశం కారణంగా అవినాష్ రెడ్డి ఇమేజ్ కు బాగా డ్యామేజ్ అయింది. ఇప్పుడు ఆయనపై పలువురు ఇలా పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు.





















