అన్వేషించండి

Somu Veerraju: బీజేపీ ఎమ్మెల్సీగా సోము వీర్రాజు... జగన్ అనుకూలుడు అనే ముద్ర..! బీజేపీ స్టాండ్ క్లియర్

Ap MLA quota MLC elections | బీజేపీ ఎమ్మెల్సి గా సోము వీర్రాజు పేరును పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఈ నెలాఖరులో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్యే ఎన్నికలు జరగనున్నాయి.

 బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు కి ఎమ్మెల్సి సీటు దక్కింది. ఖాళీ అయిన 5 ఎమ్మెల్సీ స్థానాల్లో మూడు టిడిపి, ఒకటి జనసేన తీసుకోగా పట్టుబట్టి మరి బిజెపి మరొకటి తీసుకుంది. ఇంతవరకు బానే ఉంది కానీ  ఆ ఒక్క సీటు ని బిజెపి హోమ్ వీర్రాజు కు కట్ట బెట్టడం పై టిడిపి శ్రేణుల నుండి విమర్శలు ఎక్కువవుతున్నాయి.  

జగన్ సానుభూతిపరుడుగా సోము వీర్రాజు పై ముద్ర

 సోము వీర్రాజు బిజెపికి అత్యంత నమ్మకమైన వ్యక్తి. పార్టీకి పూర్తిగా అంకితమైపోయిన  నాయకుడు. అంతవరకు ఓకే కానీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సానుభూతిపరుడుగా టిడిపి శ్రేణులు భావిస్తుంటాయి. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు పై ఆయన చేసిన విమర్శలే కారణం. బిజెపికి రాష్ట్ర అధ్యక్షుడుగా ఆయన ఉన్న సమయంలో  టిడిపి అంటే మండిపడుతుండేవారు. ఆయన అధికంగా చేసిన విమర్శలు తెలుగుదేశం పైనే. దానితో ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానాన్ని  ఆయనకు ఎలా కేటాయిస్తారు అంటూ క్షేత్రస్థాయి టిడిపి కార్యకర్తలు నుండి  అసహనం వ్యక్తం అవుతోంది. నిజానికి ఈ సీటును బిజెపికి చెందిన ఉత్తరాంధ్ర నాయకుడు  మాధవ్ కి కేటాయిస్తారని ప్రచారం జరిగింది. కానీ సడన్ గా సోము వీర్రాజు పేరు ఖరారైంది. ప్రస్తుతానికి శాసనమండలిలో  వైసిపిదే బలం. అక్కడ తమ వాయిస్ బలంగా వినిపించడానికి  కూటమి నాయకులు వైసిపి పాలన లో జరిగిన తప్పులను  ఎండగట్టే నాయకులకే ఎమ్మెల్సీ సీట్లు కట్టబెడుతోంది. టిడిపి నుంచి గ్రీష్మ, జనసేన నుండి నాగబాబు ఆకోవకు చెందినవారే. బిజెపి నుండి మాత్రం గతంలో టిడిపి పై విమర్శలు చేసిన సోమ వీర్రాజుకి ఎమ్మెల్సీ సీటు ఇస్తే ఆ స్థాయిలో వైసీపీపై విరుచుకుపడతారా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. 

జనసేన సాయం చేసిందా?
 సోము వీర్రాజు మెగా ఫ్యామిలీకి సన్నిహితుడు. ఆయన గతంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు అయిన వెంటనే హైదరాబాద్ వెళ్లి మరీ మెగా ఫ్యామిలీని కలిసి వచ్చారు. ప్రస్తుతం సోము వీర్రాజుకి ఎమ్మెల్సీ సీటు దక్కడం వెనక జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ పని చేసింది అంటున్నారు. 

 సొంతంగా బలపడే ఉద్దేశంలో బీజేపీ 

 ఏపీలో ఎలాగైనా బలపడే ప్రయత్నాలు చేస్తున్న  బిజెపి  తగ్గట్టుగానే వ్యూహాలు పన్నుతోంది. అందులో భాగంగానే తమకు అత్యంత నమ్మకంగా ఉండే సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ సేటు కేటాయించేలా చేసింది. ప్రస్తుతం ఏపీలో ఉన్న బిజెపి నాయకుల్లో అంతో ఇంతో మాస్ ఇమేజ్ ఉన్నది సోము వీర్రాజు కు మాత్రమే. ఆయనకు ఎమ్మెల్సీ కేటాయించడం ద్వారా కార్యకర్తలకు ఒక మెసేజ్ పంపినట్టు ఉంటుందని మరింతమంది బిజెపి వైపు తిరిగే ఛాన్స్ ఉంటుందనేది వారి ఆలోచన. మాధవ్ తో పోలిస్తే సోము వీర్రాజు కాస్త దూకుడుగా ఉండే వ్యక్తి. ఇది పార్టీని మాస్ లోకి తీసుకువెళ్లడానికి ఉపయోగపడుతుందని పార్టీ అధిష్టానం భావిస్తుంది. 2027లో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాల్లో  మాధవ్ కి సీటు ఇవ్వడం ద్వారా ఎన్నికలకు దగ్గరలో  ఉత్తరాంధ్ర ప్రజలకు కూడా  న్యాయం చేశామనే మెసేజ్ పంపే ఆలోచన బిజెపి హై కమాండ్ చేస్తోంది. అయితే కూటమిలో చేరింది అన్న ఒకే ఒక కారణంతో  రాష్ట్రంలో ఖాళీ అయ్యే ప్రతి పదవి లోనూ బిజెపి వాటాకు రావడం పై అసహనం వ్యక్తం చేస్తున్నాయి టీడీపీ శ్రేణులు. ఇప్పటికే ఒక రాజ్యసభను ఆర్ కృష్ణయ్య కోసం తీసుకుపోయారు. విజయసాయి రెడ్డి ఖాళీ చేసిన స్థానాన్ని  కూడా బిజెపి అడుగుతోంది. అది కాకుండా ప్రస్తుతం ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాల్లోనూ ఒకటి బీజేపీ పట్టుకుపోవడం అది కూడా  చంద్రబాబుపై గతంలో విమర్శలు గుప్పించిన సోము వీర్రాజు కు కేటాయించడం పై టీడీపీ శ్రేణులకు మింగుడు పడడం లేదు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Somu Veerraju: బీజేపీ ఎమ్మెల్సీగా సోము వీర్రాజు... జగన్ అనుకూలుడు అనే ముద్ర..! బీజేపీ స్టాండ్ క్లియర్
బీజేపీ ఎమ్మెల్సీగా సోము వీర్రాజు... జగన్ అనుకూలుడు అనే ముద్ర..! బీజేపీ స్టాండ్ క్లియర్
CM Revanth Reddy: SLBC టన్నెల్ నుంచి ఒకరి మృతదేహం వెలికితీత, రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
SLBC టన్నెల్ నుంచి ఒకరి మృతదేహం వెలికితీత, రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad News: హైదరాబాద్‌లో క్రికెట్ ప్రేమికులపై లాఠీఛార్జ్, తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం
హైదరాబాద్‌లో క్రికెట్ ప్రేమికులపై లాఠీఛార్జ్, తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం
Rohit Sharma Latest News: మా గురించి దుష్ప్రచారం చేయొద్దు, ఫైనల్ అనంతరం రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు
మా గురించి దుష్ప్రచారం చేయొద్దు, ఫైనల్ అనంతరం రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Virat Kohli Kolatam | వైట్ కోటులతో రచ్చ చేసిన టీమిండియా హీరోలు | ABP DesamRohit Sharma Fitness Champions Trophy 2025 | ఫిట్ నెస్ లేకుండానే రెండు ఐసీసీ ట్రోఫీలు కొట్టేస్తాడాRohit Sharma Champions Trophy 2025 | 9నెలల్లో రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్ రోహిత్ శర్మInd vs Nz Champions Trophy 2025 Final | ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా టీమిండియా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Somu Veerraju: బీజేపీ ఎమ్మెల్సీగా సోము వీర్రాజు... జగన్ అనుకూలుడు అనే ముద్ర..! బీజేపీ స్టాండ్ క్లియర్
బీజేపీ ఎమ్మెల్సీగా సోము వీర్రాజు... జగన్ అనుకూలుడు అనే ముద్ర..! బీజేపీ స్టాండ్ క్లియర్
CM Revanth Reddy: SLBC టన్నెల్ నుంచి ఒకరి మృతదేహం వెలికితీత, రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
SLBC టన్నెల్ నుంచి ఒకరి మృతదేహం వెలికితీత, రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad News: హైదరాబాద్‌లో క్రికెట్ ప్రేమికులపై లాఠీఛార్జ్, తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం
హైదరాబాద్‌లో క్రికెట్ ప్రేమికులపై లాఠీఛార్జ్, తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం
Rohit Sharma Latest News: మా గురించి దుష్ప్రచారం చేయొద్దు, ఫైనల్ అనంతరం రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు
మా గురించి దుష్ప్రచారం చేయొద్దు, ఫైనల్ అనంతరం రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు
TDP MLC Candidates: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే.. వారికే అవకాశం ఎందుకంటే ?
టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే.. వారికే అవకాశం ఎందుకంటే ?
Rohit Sharma Records: 37 ఏళ్ల కరువు తీర్చేసిన రోహిత్ శర్మ, అరుదైన భారత కెప్టెన్‌గా నిలిచిన హిట్ మ్యాన్
37 ఏళ్ల కరువు తీర్చేసిన రోహిత్ శర్మ, అరుదైన భారత కెప్టెన్‌గా నిలిచిన హిట్ మ్యాన్
Viveka Murder: ఒక హత్య.. ఆరు మరణాలు.. అంతుచిక్కని ఈ మిస్టరీకి అంతం ఎప్పుడు.. ?
ఒక హత్య.. ఆరు మరణాలు.. అంతుచిక్కని ఈ మిస్టరీకి అంతం ఎప్పుడు.. ?
జైలు పాలైన మిస్ ఇండియా కంటెస్టెంట్... చేయని తప్పునకు కెరీర్ నాశనం... వ్యభిచారం ఆరోపణలు... ఈ హీరోయిన్ ఎవరో తెలుసా?
జైలు పాలైన మిస్ ఇండియా కంటెస్టెంట్... చేయని తప్పునకు కెరీర్ నాశనం... వ్యభిచారం ఆరోపణలు... ఈ హీరోయిన్ ఎవరో తెలుసా?
Embed widget