Ritu Varma: రీతూ వర్మ కొత్త అవతార్: గోపీచంద్ 33లో సత్యవతిగా... ఫస్ట్ లుక్ చూశారా?
Gopichand 33 Update: గోపీచంద్ హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి ఓ సినిమా నిర్మిస్తున్నారు. అందులో కథానాయికగా రీతూ వర్మ ఎంపిక అయ్యారు. ఇవాళ ఆమె లుక్ విడుదల చేశారు.

రీతూ వర్మ (Ritu Varma) హైదరాబాదీ అమ్మాయి. కథానాయికగా ఆమెకు విజయం అందించిన 'పెళ్లి చూపులు' నుంచి మొదలు పెడితే... 'మజాకా' వరకు మోడ్రన్ రోల్స్ ఎక్కువ చేశారు. బట్, ఫర్ ఏ ఛేంజ్... రీతూ వర్మ లుక్ ఛేంజ్ చేశారు యంగ్ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి (Sankalp Reddy). ఆ లుక్ ఏమిటి? ఆ సినిమా ఏమిటి? అనేది చూడండి.
గోపీచంద్ సరసన రీతూ వర్మ
Ritu Varma Role In Gopichand 33: మ్యాచో స్టార్ టి గోపీచంద్ కథానాయకుడిగా యంగ్ అండ్ విజనరీ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ రూపొందుతోంది. ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకం మీద శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ ప్రజెంటర్. గోపీచంద్ 33వ సినిమా కావడంతో #Gopichand33 వర్కింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో రీతూ వర్మ కథానాయికగా ఎంపిక అయ్యారు.
మార్చి 10న హీరోయిన్ రీతూ వర్మ పుట్టినరోజు (Ritu Varma Birthday). అందుకని, గోపీచంద్ - సంకల్ప్ రెడ్డి సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు. సత్యవతి పాత్రలో నటిస్తున్నట్టు తెలిపారు. బాణం పట్టుకుని గురి పెట్టిన రీతూ వర్మ లుక్ కొంచెం కొత్తగా ఉందని చెప్పాలి.
Also Read: Polena Anjana Pawanova: అల్లు శిరీష్ పెళ్లిలో మెరిసిన అంజనా... పవన్ చిన్న కూతుర్ని చూశారా?
View this post on Instagram
గోపీచంద్33 సినిమాను భారీ నిర్మాణ వ్యయంతో రూపొందిస్తున్నామని, తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు ఎప్పుడూ, ఏ సినిమాలోనూ చూడనటువంటి పతాక సన్నివేశాలు - యాక్షన్ సీన్స్ ప్రేక్షకులకు మరచిపోలేని అనుభూతి ఇస్తాయని చిత్ర బృందం చెబుతోంది. ఈ సినిమాకు ఛాయాగ్రహణం: సౌందర్ రాజన్, కూర్పు: చోటా కె ప్రసాద్, ఫైట్ మాస్టర్స్: వెంకట్ - పృథ్వీ - రియల్ సతీష్, డ్యాన్స్ మాస్టర్స్: శంకర్ - విజయ్ పోలంకి.
Also Read: Shiman Mandanna: ఎవరీ షిమన్? విజయ్ - రష్మిక పెళ్లి సందడిలో క్యూట్ లిటిల్ గర్ల్ ఎవరో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు























