Telangana Latest News: మంచిర్యాల జిల్లాలో కూల్ డ్రింక్ మూత మింగి 9నెలల బాలుడి మృతి
Telangana Latest News: మంచిర్యాల జిల్లాలో కూల్ డ్రింక్ మూత మింగి కానిస్టేబుల్ కుమారుడు మృతి చెందాడు. శుభకార్యం జరుగుతున్న ఇంటిలో విషాదం నెలకొంది.

Telangana Latest News: మంచిర్యాల జిల్లా లక్సట్టిపేట్ మున్సిపాలిటీ పరిధిలోని ఉత్కూర్ లో విషాదం చోటుచేసుకుంది. సురేందర్ అనే వ్యక్తి కుమారుడు రుద్ర అయాన్ (9నెలల) బాబు కూల్ డ్రింక్ మూత మింగి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. బెల్లంపల్లిలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న సురేందర్ కుటుంబ సమేతంగా లక్సట్టిపేట్ మండలం కొమ్ముగూడెంలోని ఓ శుభకార్యానికి హాజరయ్యారు. అయితే అక్కడ రుద్ర అయాన్ ప్రమాదవశాత్తు ఓ కూల్ డ్రింక్ మూత మింగాడు.
మూత మింగేసిన కుర్రాడు శ్వాస అందకపోవడంతో ఏడవడం మొదలు పెట్టారు. దీన్ని గమనించిన తల్లిదండ్రులు, స్థానికులు హుటాహుటిన చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు అతడికి చికిత్స అందించగా బాలుడు పొందుతూ మృతి చెందాడు.
శుభకార్యానికి వచ్చి సంబరంగా ఉన్న వారు బాబు మృతితో విషాదంలోకి వెళ్లిపోయారు. తల్లిదండ్రులతోపాటు కుటుంబ సభ్యులంత గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు. బాబు మృతితో గ్రామంలో విషద ఛాయాలు నెలకొన్నాయి.
ఆదివారంలో కూడా ఇలాంటి రెండు ఘటనలు జరిగాయి. మహబూబాబాద్, విజయనగరం జిల్లాల్లో ఇలానే ఇద్దరు చిన్నారులు ఆసుపత్రి పాలయ్యారు. మహబూబాబాద్‌లోని గూడూరు మండలంలో నాయకపల్లికి చెందిన బాలుడు పల్లీగింజ మింగి ఊపిరి ఆడక ఇబ్బంది పడ్డాడు. అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుంటూ మూడు రోజుల తర్వాత మృతి చెందాడు. విజయనగరం జిల్లాలో ఓ బాలుడు సైకిల్ ట్యూబ్ వాల్వ్‌పిన్ మింగేశాడు. సకాలంలో ఆసుపత్రికి తరలించడంతో వైద్యం అందించి బాలుడిని కాపాడారు. వీళ్లంతా కూడా ఏడాదిన్నర లోపు పిల్లలే.
పిల్లలుఅడుకుంటున్న టైంలో వారిని ఏకాంతంగా వదిలేయకుండా ఓ కన్నేసి ఉంచాలని వైద్యులు చెబున్నారు. వారికి అందుబాటులో కొన్ని రాకల వస్తువులు ఉంచకపోవడం మంచిదని అంటున్నారు. నోటిలో ఏమైనా పెడుతున్నట్టు గమనిస్తే వెంటనే వారించాలని అలాంటివి చేయడం వల్ల కలిగే అనర్ధాలు వివరించాలని సూచిస్తున్నారు.
బాలిక అనుమానాస్పద మృతి
Adilabad Latest News: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న లాలిత్య (13)అనే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. లాలిత్యం (13) అనే 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని లాలిత్య గత రాత్రి అనుమానస్పదంగా నిద్రలోనే కన్నుమూసింది. తోటి విద్యార్థులు అందరూ ఉదయం నిద్ర లేచిన లాలిత్యం అనే విద్యార్థిని నిద్ర లేవకపోవడంతో వెంటనే అక్కడే ఉన్న విద్యార్థులు పాఠశాల సిబ్బందికి తెలిపారు. సిబ్బంది వచ్చి విద్యార్థి వద్దకు వెళ్లి చూడగా అప్పటికే ఆమె మృతి చెందింది.
విషయాన్ని వెంటనే తల్లిదండ్రులకు పాఠశాల సిబ్బంది సమాచారం ఇచ్చారు. హుటాహుటిన వచ్చిన విద్యార్థిని తల్లిదండ్రులు పాప ఎలా చనిపోయిందని ఆవేదనకు గురై కన్నీటి పర్యంతమయ్యారు. పాఠశాలకు నిన్ననే వచ్చి తమ పాపను చూసామని బాగానే ఉంది చెప్పారు. ఇప్పుడు పాప ఎలా చనిపోయిందంటూ ఆందోళన చేశారు. బోరున మొరపెట్టుకున్నారు.
ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోథ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన విద్యార్థి స్వగ్రామం బజార్ హత్నూర్ మండలం మోర్కండి గ్రామం. మోర్కండి గ్రామానికి చెందిన రాజేశ్వర్ - లక్ష్మీబాయి దంపతుల పెద్ద కుమార్తె లాలిత్య (13). తమ కూతురు మరణంపై అనుమానాలున్నాయని విద్యార్థిని తల్లి తండ్రులు ఆరోపిస్తున్నారు. న్యాయం కావాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. బోథ్‌లో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. తన కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆందోళన కొనసాగిస్తున్నారు.



















