అన్వేషించండి

Yanamala Rama Krishnudu: టీడీపీలో యనమల శకం ముగిసిందా, సీనియర్ నేత ఆ రెండు పొరపాట్లు చేశారా ?

Andhra Pradesh News | టిడిపిలో యనమల శకం ముగిసిందా? పార్టీలో చేరిన తర్వాత మొట్టమొదటిసారి ఏ పదవి లేకుండా యనమల రామకృష్ణుడు ఉండడం ఇదే తొలిసారి కావడంతో చర్చ జరుగుతోంది.

Yanamala Political Career | తెలుగుదేశం పార్టీలో అత్యంత సీనియర్ నేతల్లో ఒకరిగా గుర్తింపు ఉన్న యనమల రామకృష్ణుడి శకం ముగిసిందా అనే చర్చ  రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతోంది. ఇటీవల ఆయన ఎమ్మెల్సీ పదవీకాలం ముగియడంతో మరొకసారి కొనసాగింపు ఉంటుందని ఆయన అనునీయులు భావించారు. కానీ చంద్రబాబు ఆయన పేరుని పరిగణలోకి తీసుకోలేదు. టిడిపికి దక్కిన మూడు స్థానాల్లో రెండు బీసీలకు కేటాయించినా వారిలో యనమల పేరు మాత్రం లేదు. బీటీ నాయుడు బీద రవిచంద్ర లను రెండు ఎమ్మెల్సి స్థానాలకు ఎంపిక చేశారు చంద్రబాబు. దానితో 1982 నుండి ఇప్పటివరకూ ఏదో ఒక పదవి లో కొనసాగుతూ వస్తున్న  యనమల రామకృష్ణుడు ఇలా ఏ పదవి లేకుండా ఉండడం ఇదే తొలిసారి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

చంద్రబాబు కు అత్యంత సన్నిహితుల్లో ఒకరుగా యనమలకు పేరు 
 చంద్రబాబుతో సహా టిడిపిలో అత్యంత సీనియర్ నేతలుగా కొనసాగుతున్న నేతల్లో రామకృష్ణుడు ఒకరు. అశోక్ గజపతి రాజు, రామకృష్ణుడు, కళా వెంకట్రావు, షరీఫ్, సోమిరెడ్డి లాంటి ఇప్పటికీ పార్టీ లో కొనసాగుతున్న అతి కొద్ది మంది పాతకాలం లీడర్ల లో  యనమల ఒకరు. మంత్రిగా, స్పీకర్ గా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడి గా అనేక కీలకపదవులు నిర్వహించారు. 73 ఏళ్ల వయస్సు లోనూ యాక్టివ్ గానే ఉంటున్నారు.   అయితే పార్టీలో యువతను ప్రోత్సహించాలనే కొత్త ఫార్ములాను టిడిపి ఈమధ్య ఆచరణ లో పెడుతోంది. దాని కారణంగా  యనమల లాంటి సీనియర్లను పక్కన పెడుతున్నారు అనే ప్రచారం పార్టీలోనే అంతర్గతంగా సాగుతోంది. యనమల కుమార్తె దివ్య ప్రస్తుతం తుని శాసనసభ్యురాలి గా ఉన్నారు. 1983 నుండి 2004 వరకూ 6 సార్లు ఎమ్మెల్యే గా యనమల రామకృష్ణుడు గెలిచిన నియోజకవర్గం అది. 2009 లో తొలిసారి ఓటమి చెందినా ఆయనకు కీలక పదవులు ఇచ్చి  టీడీపీ గౌరవించింది. ఈసారి మాత్రం ఎమ్మెల్సీ స్థానంలో ఆయనను కొనసాగించకపోవడంతో పొలిటికల్ గా యనమల కెరీర్ కు చెక్ పడినట్టే అని ప్రచారం మొదలైంది 


 యనమల ఆ రెండు పొరపాట్లు చేశారా?
 పొలిటికల్ గా ఎప్పుడు గుంభనంగా ఉండే యనమల రామకృష్ణుడు ఇటీవల రెండు విషయాల్లో మాత్రం పార్టీ పై తన అసంతృప్తి ని బాహటంగానే ప్రకటించారు. ఒకటి రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక లో తన అసహనాన్ని వ్యక్తం చేశారు. బీసీ కోటాలో ఆయన ఆ పదవి ఆశించారు. దక్కకపోయేసరికి  కొంత అసంతృప్తికి లోనయ్యి అధ్యక్షుడికి లేఖ రాశారు. రెండోది కాకినాడ సెజ్ విషయంలో  ఈ విధానం పైన తన అసంతృప్తిని వెళ్ళగక్కారు. ఇవి నిజానికి అంతర్గతంగా జరగాల్సిన విషయాలు. ఈ రెండు సంఘటనలు పార్టీలోని యువ నాయకత్వానికి యనమలకు మధ్య గ్యాప్ ని తెచ్చేయనేది  అంతర్గత వర్గాల సమాచారం 

యనమలకు తగిన పదవి 
 మరోవైపు యనమల పార్టీకి చేసిన సేవలను దృష్టిలో పెట్టుకుని హై కమాండ్ ఏదో ఒక కీలకపదవి అప్పజెబుతోందని లేదా 2027 లో ఖాళీ అయ్యే 23ఎమ్మెల్సి స్థానాల్లో అయినా ఆయనకు చోటు కల్పిస్తారని యనమల అభిమానులు ఆశవహంతో ఉన్నారు. మరి వారి కోరిక నెరవేరుతుందో లేదో చూడాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

Also Read: Somu Veerraju: బీజేపీ ఎమ్మెల్సీగా సోము వీర్రాజు... జగన్ అనుకూలుడు అనే ముద్ర..! బీజేపీ స్టాండ్ క్లియర్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Andhra 22 A Lands : ఏపీ ప్రజలకు నూతన సంవత్సర కానుక - 22A నిషేధిత జాబితా నుండి 5 రకాల భూముల తొలగింపు
ఏపీ ప్రజలకు నూతన సంవత్సర కానుక - 22A నిషేధిత జాబితా నుండి 5 రకాల భూముల తొలగింపు
Cigarette Price: ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్ ధరలు ఎంత పెరుగుతాయి? రూ.75 నిజమేనా?
ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్ ధరలు ఎంత పెరుగుతాయి? రూ.75 నిజమేనా?
Telangana Student Died: జర్మనీలో తెలంగాణ విద్యార్థి హృతిక్ రెడ్డి మృతి- న్యూ ఇయర్ రోజున కుటుంబంలో విషాదం!
జర్మనీలో తెలంగాణ విద్యార్థి హృతిక్ రెడ్డి మృతి- న్యూ ఇయర్ రోజున కుటుంబంలో విషాదం!
Iran Crisis : ఒక్క డాలర్‌కు 14 లక్షల రియాల్స్ - ఇరాన్‌లో రోడ్డెక్కిన ప్రజలు - ఆయిల్ రిచ్ కంట్రీలో ఏం జరుగుతోంది?
ఒక్క డాలర్‌కు 14 లక్షల రియాల్స్ - ఇరాన్‌లో రోడ్డెక్కిన ప్రజలు - ఆయిల్ రిచ్ కంట్రీలో ఏం జరుగుతోంది?

వీడియోలు

Rohin Uttappa about Rohit Virat Retirement | రో - కో టెస్ట్ రిటైర్మెంట్ పై మాజీ ప్లేయర్ వ్యాఖ్యలు
Sarfaraz Khan in Vijay Hazare Trophy | రోహిత్ రికార్డు బద్దలు కొట్టిన సర్ఫరాజ్
Devdutt Padikkal Vijay Hazare Trophy | సూపర్ ఫామ్‌లో దేవ్‌దత్ పడిక్కల్
పాతికేళ్లలో ఊహించలేని విధంగా మన ప్రపంచం మారిపోయింది
Indian Cricket High pay Profession | టాలెంట్ ఉందా..క్రికెట్ ఆడు..కోట్లు సంపాదించు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra 22 A Lands : ఏపీ ప్రజలకు నూతన సంవత్సర కానుక - 22A నిషేధిత జాబితా నుండి 5 రకాల భూముల తొలగింపు
ఏపీ ప్రజలకు నూతన సంవత్సర కానుక - 22A నిషేధిత జాబితా నుండి 5 రకాల భూముల తొలగింపు
Cigarette Price: ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్ ధరలు ఎంత పెరుగుతాయి? రూ.75 నిజమేనా?
ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్ ధరలు ఎంత పెరుగుతాయి? రూ.75 నిజమేనా?
Telangana Student Died: జర్మనీలో తెలంగాణ విద్యార్థి హృతిక్ రెడ్డి మృతి- న్యూ ఇయర్ రోజున కుటుంబంలో విషాదం!
జర్మనీలో తెలంగాణ విద్యార్థి హృతిక్ రెడ్డి మృతి- న్యూ ఇయర్ రోజున కుటుంబంలో విషాదం!
Iran Crisis : ఒక్క డాలర్‌కు 14 లక్షల రియాల్స్ - ఇరాన్‌లో రోడ్డెక్కిన ప్రజలు - ఆయిల్ రిచ్ కంట్రీలో ఏం జరుగుతోంది?
ఒక్క డాలర్‌కు 14 లక్షల రియాల్స్ - ఇరాన్‌లో రోడ్డెక్కిన ప్రజలు - ఆయిల్ రిచ్ కంట్రీలో ఏం జరుగుతోంది?
LPG Price : కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!
కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!
Haq OTT Release Date: నెట్‌ఫ్లిక్స్‌లో 'హక్' స్ట్రీమింగ్... మహిళల హక్కులపై కోర్ట్ రూమ్ డ్రామా... దీని స్పెషాలిటీ ఏమిటంటే?
నెట్‌ఫ్లిక్స్‌లో 'హక్' స్ట్రీమింగ్... మహిళల హక్కులపై కోర్ట్ రూమ్ డ్రామా... దీని స్పెషాలిటీ ఏమిటంటే?
New Year Celebration Tragedy: తెలుగు రాష్ట్రాల్లో 2026 స్వాగత సంబరాల్లో విషాదం; వివిధ కారణాలతో ముగ్గురు మృతి
తెలుగు రాష్ట్రాల్లో 2026 స్వాగత సంబరాల్లో విషాదం; వివిధ కారణాలతో ముగ్గురు మృతి
Eluru Crime News: ఏలూరులో ప్రేమిస్తే సీన్‌ రిపీట్‌- ఇంటి ఆడపిల్లలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై దాడి!
ఏలూరులో ప్రేమిస్తే సీన్‌ రిపీట్‌- ఇంటి ఆడపిల్లలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై దాడి!
Embed widget