Cockroach Milk :బొద్దింక పాలదే భవిష్యత్- ఆవు, గేదె పాలను మించిన సూపర్ ఫుడ్!
Cockroach Milk :ఆవు పాల కంటే బొద్దింక పాలు ఖరీదైనవి అవుతాయని, పరిశోధకులు భావిస్తున్నారు. భవిష్యత్‌లో ఇది మూడు రెట్లు ఎక్కువ పోషకమైనదని అవుతందని అంచనా వేస్తున్నారు.

Cockroach Milk :సూపర్ ఫుడ్ అనే పదాన్ని సాధారణంగా ఫిట్‌నెస్, వెల్‌నెస్ సర్కిల్‌ల్లో ఉపయోగిస్తారు. ముదురు ఆకుపచ్చ ఆకు కూరలు, బెర్రీలు, గింజలు వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహార పదార్థాలు గురించి చెబుతుంటారు. ఇవి అధిక కేలరీలు, పోషకాలను కలిగి ఉంటాయి. ఈ పుడ్ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా భావిస్తారు.
సూపర్ ఫుడ్‌గా బొద్దింకపాలు
బొద్దింక పేరు చెబితేనే చాలా మంది భయపడి అక్కడి నుంచి పారిపోతారు. ఇంట్లో నిత్యం బొద్దింకలు తిరుగుతుంటే వాటిని ఎలా నివారించాలా అనే తలలు పట్టుకుంటారు. అలాంటి బొద్దింకల పాలే భవిష్యత్‌లో సూపర్ మిల్క్ అంటున్నారు శాస్త్రవేత్తలు.
వినడానికి వింతగా ఉన్నా...
ఈ సూపర్ ఫుడ్‌లో ఇప్పుడు బొద్దింక పాలు చేరిపోయాయి. ఇది వినడానికి వింతగా అనిపించవచ్చు, కానీ శాస్త్రవేత్తలు బొద్దింక పాలు చాలా మంచిదని చెబుతున్నారు. ముఖ్యంగా డిప్లోప్టెరా పంక్టాటా జాతికి చెందినవి బొద్దింక పాలు ఆవు, గేదె పాల కంటే మూడు రెట్లు ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయని కనుగొన్నారు.
అవు, గేదె పాలకు మించిన శక్తి అట
ఈ ఆవిష్కరణ పోషకాహార నిపుణులలో ఆసక్తిని రేకెత్తించింది. బొద్దింక పాలు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయని ఎవరైనా అనుకుంటారా. కానీ ఈ బద్దింక పాలలో ప్రోటీన్లు, కొవ్వులు, చక్కెర పుష్కలంగా ఉన్నాయని పరిశోధకులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. భూగ్రహంపై అత్యంత పోషకాలు అధికంగా ఉండే ఆహారాల్లో ఒకటిగా ఉంటుందట.
Also Read: మాట వినాలి, గురుడా మాట వినాలి! మహిళా దినోత్సవం రోజున ఆడవాళ్లకు ఇచ్చే గొప్ప బహుమతి ఇదే!
బొద్దింక పాలలో పోషకాలు పుష్కలం
పోషకాలు పుష్కలంగా ఉండే బొద్దింక పాలు భవిష్యత్తులో ఆహార ఆవిష్కరణల్లో కీలక పాత్ర పోషించవచ్చనే వాదన బలపడుతోంది. అందుకే శాస్త్రవేత్తలు దీనిపై రాత్రిపగలు అధ్యయనం చేస్తున్నారు. ఈ పరిశోధనలు ప్రైమరీ స్టేజ్‌లో ఉన్నప్పటికీ ఈ ఆవిష్కరణ ఫుడ్ విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలు సూచిస్తోంది.
'జర్నల్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ క్రిస్టలోగ్రఫీ'
జర్నల్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ క్రిస్టల్లాగ్రఫీలో 2016లో ప్రచురితమైన ఒక అధ్యయనం, పసిఫిక్ బీటిల్ బొద్దింకలు తమ పిల్లలకు ఆహారం ఇచ్చేందుకు పాలు లాంటి ద్రవాన్ని వదులుతాయి. ది ఇండిపెండెంట్ ప్రకారం, బొద్దింకల పిల్లలకు ఆహారం పెట్టినప్పుడు, వాటి కడుపులో పసుపు రంగు పదార్థాన్ని గుర్తించారు. దాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు ఆవు పాల కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ కేలరీలు కలిగి ఉందని కనుగొన్నారు. ఇందులో కణాల పెరుగుదల, రిపేర్ చేసుకునేందుకు సహాయపడే ప్రోటీన్, అమైనో ఆమ్లాలు, ఆరోగ్యకరమైన చక్కెరలు ఉన్నాయని గుర్తించారు.
ఇవన్నీ ఉన్నప్పటికీ ఇండిపెండెంట్ నివేదిక ప్రకారం, బొద్దింక పాలు ఇంకా మానవ వినియోగానికి అందుబాటులోకి రాలేదు. దాని ఉత్పత్తే అతిపెద్ద అడ్డంకి అని అభిప్రాయపడుతోంది.



















