Tirumala Stampede: తిరుమలలో తొక్కిసలాట జరిగిన స్థలాన్ని పరిశీలించిన విచారణ కమిటీ సభ్యులు

తిరుపతి: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ సమయంలో జరిగిన తొక్కిసలాటపై విచారణ కమిటీ రంగంలోకి దిగింది. ఆదివారం కమిటీ సభ్యులు తొక్కిసలాట జరిగిన ప్రాంతాలను పరిశీలించారు. వైకుంఠ ద్వార దర్శనం భక్తులు మధ్య జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీ ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో విచారణ కమిటీ వేసిన సంగతి తెలిసిందే. తొక్కిసలాటపై విచారణ కోసం తిరుపతి కలెక్టరేట్‌లో ప్రత్యేక ఛాంబర్ ను ఆధికారులు ఏర్పాటు చేశారు. బైరాగిపట్టెడ, పద్మావతి పార్క్, రామానాయుడు పబ్లిక్ స్కూల్ ప్రాంతాలను పరిశీలించిన విచారణ కమిటీ.. టీటీడీ అధికారులు, పోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విచారణలో భాగంగా సత్యనారాయణమూర్తి కమిటీ సభ్యులు అక్కడ విధులు నిర్వహించిన ఉద్యోగులు, సిబ్బందిని ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ కమిటీ 6 నెలల్లో విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

