అన్వేషించండి

New York Telangana Telugu Association: న్యూయార్క్ లో ఘనంగా తెలుగువారి నైటా పండుగలు.. ముఖ్య అతిథిగా మేయర్

అమెరికాలో తెలుగువారి సంబురాలు అంబరాన్ని తాకాయి. ఒకే రోజు మహిళాదినోత్సవం, శివరాత్రి వేడుకులను ఘనంగా నిర్వహించారు. తెలుగువారి బలగం, బలం ఉట్టిపడేలా సాంస్కృతి కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి.

New York Telangana Telugu Association | అమెరికాలో మన తెలుగువారు ఏం చేసినా అది వేరే లెవల్. తెలుగు పండుగుల ముచ్చటకొస్తే ఇంక మాటల్లో చెప్పనక్కర్లేదు. సంక్రాంతి మొదలు బతుకమ్మ వరకూ పండుగంటే ఎట్లుంటదో అమెరికా వాళ్లకు చూపించాలంటే మన తెలుగువారి తరువాతే మరెవరైనా. తాజాగా అమెరికాలో జరిగిన మహిళాదినోత్సవ వేడుకలు , అదే రోజు మహాశివరాత్రి పండుగ ఒకే వేదికపై జరుపుకుని తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను వెలుగెత్తి చాటారు. 

గణేష్ టెంపుల్ ఆడిటోరియంలో వేడుకలు

అమెరికావాణిజ్య రాజధాని న్యూయార్క్ లో కళ్లు చెదిరేలా అత్యంత వైభవంగా ఈ వేడుకలు నిర్వహించారు. తెలంగాణ తెలుగు సంఘం (నైటా) ఆధ్వర్యంలో ఫ్లషింగ్ గణేష్ టెంపుల్ ఆడిటోరియంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. వందలాది మంది తెలంగాణ, తెలుగు వాసులు తమ కుటుంబాలతో సహా కలసి ఉత్సవాల్లో పాల్గొని ఆడి పాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ మాట్లాడుతూ అమెరికాతో పాటు న్యూ యార్క్ మహానగరం అభివృద్ది, సంస్కృతిలో తెలుగువారు అంతర్భాగం అయ్యారని కొనియాడారు.

తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్కమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క, తదితర ప్రముఖులు ప్రత్యేక సందేశాల ద్వారా నైటా కార్యక్రమాలను, ఆర్గనైజింగ్ కమిటీ కృషిని ప్రశంసిస్తూ ప్రత్యేక సందేశాలను పంపారు.  నైటా వార్షికోత్సవ సావనీర్ ను ఈ సందర్భంగా విడుదల చేశారు. ఈ ఫెస్టివల్ ఈవెంట్ లో తెలంగాణ సూపర్ రైటర్, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ కాసర్ల శ్యామ్ తో పాటు, యూకే నుంచి సింగర్ స్వాతి రెడ్డి, డాన్సింగ్ అప్సరాస్ గా పేరొందిన టీ అండ్ టీ సిస్టర్స్, ఇండియన్ ఫేమస్ ఫ్యూజన్ మ్యూజిక్ గ్రూప్ పరంపరా లైవ్ ఫెర్మామెన్స్ తో అదరగొట్టారు. కొన్ని గంటల పాటు జరిగిన కార్యక్రమం ఆద్యంతం అందరినీ కట్టిపడేసింది.

తెలుగు యువత గుండెల్లో చిరకాలం నిలిచిపోయే పాటలను రచించటంతో పాటు, పాడిన యువ గాయకుడు కాసర్ల శ్యామ్ తెలుగు హిట్ సాంగ్స్ తో అందరినీ ఉర్రూతలూగించారు. అమెరికాలో తెలుగువారి బలగాన్ని, బలాన్ని తన పాటల ద్వారా శ్యామ్ చాటి చెప్పారు. కాస్త ఆలస్యంగానైనా న్యూయార్క్ తెలుగువారు శివరాత్రి వేడుకలు జరుపుకున్నా ఆధ్యాత్మిక గీతాలు, చిన్నారులు భక్తి పాటలతో ఆడిటోరియటం మారు మోగింది. న్యూయార్క్ మహానగరంలో నిత్యం వారి వారి వృత్తుల్లో బిజీగా ఉండే మన తెలుగు వారు అన్నింటినీ పక్కన పెట్టి అటు శివ భక్తి, ఇటు మహిళా దినోత్సవాన్ని ఒకే సారి వేడుకగా జరుపుకున్నారు.ఆకట్టుకునే డ్రస్ కోడ్ తో చిన్నారులు చేసిన కూచిపూడి నృత్యాలు ఆద్యాంతం వీక్షలను అలరించాయి. మహాశివునిపై ప్రత్యేకంగా రూపొందించిన యువతుల నాట్యం వారెవ్వా అనిపించింది. ముఖ్యంగా అమెరికాలో ఉన్న తెలంగాణ వాసులు మాత్రమేకాదు, న్యూయార్క్ నగరంలోని ప్రముఖులు, ప్రజాప్రతినిధులు సైతం నైటా వేడుకులకు ఫిదా అయ్యారు. పండుగల విశిష్టతను మాత్రమేకాదు మహిళలలో ఆత్మస్ధైర్యం నింపేలా మహిళా దినోత్సవ ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటిచప్పడంతోాపాటు, దేశ సరిహద్దులు దాటినా తెలంగాణ మహిళల ప్రత్యేకత, ఆచార సంప్రదాలను గౌరవించుకోవడం నైటా కు ప్రతీ ఏాటా ఆనవాయితీగా వస్తోంది.
New York Telangana Telugu Association: న్యూయార్క్ లో ఘనంగా తెలుగువారి నైటా పండుగలు.. ముఖ్య అతిథిగా మేయర్
New York Telangana Telugu Association: న్యూయార్క్ లో ఘనంగా తెలుగువారి నైటా పండుగలు.. ముఖ్య అతిథిగా మేయర్

టాప్ హెడ్ లైన్స్

Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
India Census 2027: జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
Harish Rao: రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు

వీడియోలు

Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Sambarala Yetigattu Release Date : సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget