Vasant Panchami Special 2025 : వసంత పంచమి సరస్వతీ పూజ.. పిల్లలతో చదివించాల్సిన శ్లోకాలు ఇవే!
Basant Panchami 2025 Wishes: ఫిబ్రవరి 03 వసంతపంచమి. ఈ రోజు సూర్యోదయానికి ముందే స్నానమాచరించి ఇంట్లో దీపం వెలిగించండి లేదంటే ఆలయాలకు వెళ్లిరండి. ఇంట్లో అయితే ఇలా పూజచేయండి..

Vasant Panchami Special 2025: మాఘశుద్ధ పంచమినే వసంత పంచమి జరుపుకుంటారు. ఈ రోజు సరస్వతీ పూజ చేసేందుకు అత్యుత్తమమైన రోజు.
మాఘ శుక్ల పంచమ్యాం విద్యారంభ దినేపిచ
పూర్వేహ్ని సమయం కృత్యాతత్రాహ్న సంయతః శుచిః
మాఘ శుక్ల పంచమిరోజు సరస్వతీ దేవిని అర్చించాలి. ముందుగా వినాయకుడిని పూజించి ఆ తర్వాత సరస్వతి దేవి ప్రతిమ, ఫొటో లేదంటే పుస్తకాలు పెట్టి పూజించవచ్చు. సరస్వతీ దేవికి షోడశోపచారాలతో పూజచేయాలి. తెల్లని పూలు సమర్పించాలి. సుగంధ ద్రవ్యాలు సమర్పించాలి తెల్లని వస్త్రాలు సమర్పించాలి. చాలా ఆలయాల్లో మూడు రోజుల పాటూ వసంతపంచమి వేడుకలు నిర్వహిస్తారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రి మీద వెలసి కనకదుర్గమ్మకు వసంత పంచమి సందర్భంగా సరస్వతీ దేవి అలంకారంలో పూజిస్తారు. బాసరలో అక్షరాభ్యాసాలు జరుగుతాయి.
గాయత్రిగా, సావిత్రిగా, పరాశక్తిగా శ్రుతులు పేర్కొన్న సర్వచైతన్య స్వరూపిణియే శారదాదేవి. అందుకే వసంత పంచమి రోజు సరస్వతీ దేవిని పూజిస్తే జ్ఞానవంతులవుతారని పండితులు చెబుతారు.
ఈ రోజు ఇంట్లో దేవుడి దగ్గర దీపం వెలిగించాక సరస్వతీ దేవికి నమస్కరించి ఈ శ్లోకాలు చదువుకోవాలి . విద్యార్థులకు ఈ శ్లోకాలు నేర్పిస్తే వారు నిత్యం పఠించడం ద్వారా వారికి జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది
Also Read: సరస్వతీ కటాక్షం కోసం వసంతపంచమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి!
ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీ వతీ ధీనామ విత్ర్య వతు ||
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ |
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ||
పద్మపత్ర విశాలాక్షీ పద్మ కేసరవందినీ |
నిత్యం పద్మాలయా దేవీ సా మాం పాతు సరస్వతీ||
సరస్వతి నమస్తుభ్యం సర్వదేవి నమో నమః |
శాంతరూపే శశిధరే సర్వయోగే నమో నమః ||
యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా
యా వీణావరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభ్రుతిభిర్దేవై సదావందితా
సా మాంపాతు సరస్వతీ భగవతీ నిశేష జాడ్యాపహా
వేదాయై వేదరూపాయై వేదాంతాయై నమో నమః |
గుణదోషవివర్జిన్యై గుణదీప్త్యై నమో నమః ||
సర్వఙ్ఞానే సదానందే సర్వరూపే నమో నమః |
సంపన్నాయై కుమార్యై చ సర్వఙ్ఞే తే నమో నమః ||
Also Read: ఈ ఏడాది వసంతపంచమి ఎప్పుడొచ్చింది .. విశిష్టత ఏంటి , సరస్వతీ దేవి పూజా విధానం ఇదే!
పోతన చెప్పిన శ్లోకం
తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్
నీవునా యుల్లంబందున నిల్చి జ్రుంభణముగా సూక్తుల్
సుశబ్దంబుశోభిల్లన్ బల్కుము నాదు వాక్కునను సంప్రతిన్
జగన్మోహినీ పుల్లాభాక్షి సరస్వతీ భగవతీ పూర్ణేందు బింబాననా....
సరస్వతీ దేవి ద్వాదశనామ స్తోత్రం
సరస్వతీ త్వయం దృష్ట్యా వీణాపుస్తకధారిణీ హంసవాహన సమాయుక్తా విద్యాదానకరీ మమ ప్రథమం భారతీ నామా ద్వితీయం చ సరస్వతీ తృతీయం శారదాదేవీ చతుర్థం హంసవాహనీ పంచమం జగతీఖ్యాతం షష్ఠం వాగీశ్వరీ తథా కౌమారీ సప్తమం ప్రోక్తమష్టమం బ్రహ్మచారిణీ నవమం బుద్ధిధాత్రీచ దశమం వరదాయినీ ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరీ బ్రాహ్మీ ద్వాదశనామాని త్రిసంధ్యం యఃపఠేన్నరః సర్వసిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరీ
సా మే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతీ!
పై శ్లోకాన్ని నిత్యం 11 సార్లు చెప్పుకుని సరస్వతి దేవికి నమస్కరించాలి. ఈ రోజు పుస్తకాలు, పెన్నులు దానం చేయడం వల్ల సరస్వతీ కరుణ ఉంటుందని చెబుతారు.
ఓం వాగ్దేవ్యైచ విద్మహే బ్రహ్మపత్న్యైచ ధీమహీ...తన్నో వాణీ ప్రచోదయాత్.
Also Read: మాఘ గుప్త నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటివరకు.. విశిష్టత, పూజా విధానం ఏంటి!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

