Magha Gupta Navratri 2025: మాఘ గుప్త నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటివరకు.. విశిష్టత, పూజా విధానం ఏంటి!
Magha Gupta Navratri Dates: ఏడాదిలో మూడుసార్లు నవరాత్రుల వేడుకలు జరుపుకుంటారు. ఆశ్వయుజమాసంలో శరన్నవరాత్రులు, చైత్రంలో వచ్చే వసంతనవరాత్రులు, మాఘమాసంలో మాఘ గుప్త నవరాత్రులు...

Magha Gupta Navratri 2025 : మాఘ గుప్త నవరాత్రులు, శ్యామల నవరాత్రులు..ఈ పండుగ గురించి దక్షిణాదిలో కన్నా ఉత్తరాదివారికి బాగా తెలుస్తుంది. ఇప్పుడు దక్షిణాదివారు కూడా ప్రతి పండుగను జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా మాఘగుప్త నవరాత్రులు కూడా అంతా పాటిస్తున్నారు.
2025లో మాఘ గుప్త నవరాత్రులు జనవరి 30 నుంచి ఫిబ్రవరి 07 వరకూ జరుపుకోవాలి.
శక్తి ఆరాధనకు తొమ్మిరోజులు రహస్య మార్గంలో సాధన చేస్తారు..అందుకే వీటిని గుప్త నవరాత్రులు అని పిలుస్తారు.
దసరాల్లో వచ్చే శరన్నవరాత్రుల్లో అమ్మవారిని రోజుకో రూపంలో పూజించినట్టే మాఘ గుప్త నవరాత్రుల్లోనూ శ్యామలాదేవిని తొమ్మదిరూపాల్లో అలంకరించి పూజిస్తారు
Also Read: మాఘ మాసం మొదలు .. వివాహాది శుభాకార్యాలకు ముహూర్తాలు ఎప్పటి నుంచి ఎప్పటివరకు!
భండాసురుడిని చంపేందుకు ఆది పరాశక్తి శ్రీలలితా దేవిగా ఉద్భవించింది. బ్రహ్మాది దేవతలను మళ్లీ సృష్టించే క్రమంలో శ్యామలాదేవిని సృష్టించింది లలితా అమ్మవారు. ఇలా సృష్టించిన శ్యామలాదేవిని ప్రధానమంత్రిగా నియమంచింది లలితాదేవి. అందుకే శ్యామలాదేవిని మహామంత్రిణీ అని స్తుతిస్తారు.
శ్రీమహావిష్ణువుకి దశావతారాలు ఉన్నట్లే అమ్మవారికి కూడా 10 రూపాలు ఉన్నాయి. వాటిని ఉపాసించే విధానాలనే "దశమహా విద్యలు" అని పిలుస్తారు. ఆ విద్యలు ఇహాన్ని,పరాన్ని కూడా ఇస్తాయి కాబట్టే మహావిద్యలు అంటారు. దశ మహా విద్యల్లో మాతంగి అని పిలుస్తారు.
హిమవంతుని స్నేహితుడైన మతంగముని తపస్సుకి సంతోషించిన శ్యామలాదేవి ఆయన కోరిన వరాన్నిస్తూ..తనకు కుమార్తెగా జన్మించింది. మతంగముని కుమార్తె కాబట్టి మాతంగి అయింది.
Also Read: రథసప్తమి ఎప్పుడు..ఆదిత్యుడి ఆరాధన వల్ల ఎలాంటి ప్రయోజనం పొందుతారు!
లలితా సహస్రనామ స్తోత్రంలో శ్యామలాదేవి గురించి ప్రస్తావన మూడు చోట్ల ఉంటుంది
గేయచక్ర రథారూఢ "మంత్రిణీ" పరిసేవితా
"మంత్రిణ్యంబా' విరచిత విషంగ వధతోషితా
"మంత్రిణీ"న్యస్త రాజ్యధూః
లలితా దేవికి కుడివైపు శ్యామలాదేవి..ఎడమవైపు వారాహి అమ్మవారు కొలువై ఉంటారు.
ఇచ్చాశక్తి - లలితా త్రిపురసుందరి దేవి
జ్ఞానశక్తి - శ్యామలాదేవి
క్రియాశక్తి - వారాహి దేవి
అందుకే లలితా సహస్రనామంలో "ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి"అనే నామంతో పూజిస్తారు.
శ్యామలదేవిని పూజిస్తే "విద్య, ఉద్యోగంలో ఉన్నతి లభిస్తుంది..సంగీత, సాహిత్యాల మీద పట్టు వస్తుంది..వాక్సుద్ధి కలుగుతుంది
Also Read: శివరాత్రులు ఎన్ని .. భోళా శంకరుడికి మహా శివరాత్రి ఎందుకు మరింత ప్రత్యేకం - శివయ్యకు ఏ అలంకారం ఇష్టం!
గుప్త నవరాత్రుల్లోని అమ్మవారి 9 అలంకారాలు
జనవరి 30 మొదటి రోజు - కాళికా దేవి
జనవరి 31 రెండో రోజు - త్రిపుర తారా దేవి (శైలపుత్రి)
ఫిబ్రవరి 1 మూడో రోజు - సుందరీ దేవి (బ్రహ్మచారిని)
ఫిబ్రవరి 2 నాలుగో రోజు - భువనేశ్వరి దేవి (చంద్రఘంట)
ఫిబ్రవరి 3 ఐదో రోజు - మాతా చిత్రమాతా త్రిపుర దేవి (కుష్మాండ)
ఫిబ్రవరి 4 ఆరో రోజు - భైరవి దేవి (స్కంద మాత)
ఫిబ్రవరి 5 ఏడో రోజు - మధుమతి దేవి (శక్తి)
ఫిబ్రవరి 6 ఎనిమిదో రోజు - మాతా బాగళాముఖి దేవి (కాత్యాయని)
ఫిబ్రవరి 7 తొమ్మిదో రోజు - మాతంగి కమలాదేవి (మహాగౌరి)
ఇవే అవతారాలు కొన్ని ప్రాంతాల్లో...తారా దేవి, కాళీ దేవి, లలితా దేవి, భువనేశ్వరి దేవి, దేవత త్రిపూర్ భైరవి, చిన్నమస్తిక దేవత,
ధూమావతి దేవి, బగళాముఖి దేవత, మాతంగి దేవి అలంకారాల్లో పూజిస్తారు..
ఉత్తర భారత రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో మాఘ గుప్త నవరాత్రులు ఘనంగా జరుపుకుంటారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

