అన్వేషించండి

Mahashivratri 2025: శివరాత్రులు ఎన్ని .. భోళా శంకరుడికి మహా శివరాత్రి ఎందుకు మరింత ప్రత్యేకం - శివయ్యకు ఏ అలంకారం ఇష్టం!

Maha Shivaratri Types: శివారాధనకు అన్ని రోజుల కన్నా అత్యంత విశిష్టమైనది మాఘ బహుళ చతుర్థశి. 2025 లో మహాశివరాత్రి ఫిబ్రవరి 26న వచ్చింది... ఇంతకీ ఎన్ని శివరాత్రులు ఉంటాయో తెలుసా...

ఏడాదిలో వచ్చే శివరాత్రులు మొత్తం అయిదు 

@ నిత్య శివరాత్రి 

@ పక్ష శివరాత్రి 

@ మాసశివరాత్రి 

@ మహాశివరాత్రి 

@ యోగశివరాత్రి

వీటిలో పరమేశ్వరుడి అత్యంత ప్రీతికరమైన పర్వదినం మహాశివరాత్రి. మార్గశిరమాసం  బహుళ చతుర్థి , ఆరుద్ర నక్షత్రం రోజున శివుడు లింగోద్భవం జరిగింది. అందుకే ఈ రోజు శివుడిని లింగరూపంలో ఆరాధిస్తారు. ఉపవాసం, జాగరణ , శివనామస్మరణ ఈరోజు అత్యంత పుణ్యఫలం.ఈ రోజు శివప్రతిష్ట, శివకల్యాణం చేస్తే మరింత ఫలితం లభిస్తుంది.

Also Read: ఫిబ్రవరి 26 or 27.. మహా శివరాత్రి ఎప్పుడు - మిగిలిన దేవుళ్ల కన్నా శివుడు ఎందుకు ప్రత్యేకం!

మహాశివరాత్రి రోజు ఎవరైతే తనను పూజిస్తారో వారు కుమారస్వామికన్నా తనకు ఇష్టులవుతారని శివుడు స్వయంగా చెప్పినట్టు శివపరాణంలో ఉంది.   త్రయోదశి రోజు నుంచి ఉపవాస నియమాలు పాటించి చతుర్థశి మొత్తం ఉపవాసం, జాగరణ చేయాలి. శివరాత్రి మర్నాడు ఉదయం స్నానమాచరించి శివపూజ చేసి ఉపవాసాన్ని విరమించాలి.  

పరమేశ్వరుడి 64 స్వరూపాలలో లింగరూపం ముఖ్యమైనది. అర్థరాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ సమయమని పురాణాలలో ఉంది. అందుకే ఈ రోజు జాగరణ చేసి మాహాలింగ దర్శనం చేసుకుంటారు. 

చిన్నా, పెద్దా, స్త్రీలు, పురుషులు అనే వ్యత్యాసం లేకుండా ఉపవాసం, జాగరణ చేసే పర్వదినమే మహాశివరాత్రి. ప్రపంచమంతా శివమయం అని తెలియడేయడమే ఈ నియమాల వెనుకున్న ఆంతర్యం 
 
మహా శివరాత్రి రోజు పరమేశ్వరుడి అలంకారాలు ఎన్నో విధాలుగా చేస్తారు. అయితే అన్ని రూపాల్లో విభూధి ధారణ చేస్తే అత్యంత సంతోషిస్తాడట శివుడు. ఎందుకంటే విభూది అంటే పూర్తిగా అగ్నిలో కాలిన శుద్ధమైన వస్తువు. శివుడు ఒంటినిండా విభూది అద్దుకుంటాడు. శివుడు మెచ్చే రెండో అలంకారం రుద్రాక్ష ధారణ. పరమేశ్వరుడి మూడో కన్నుగా చెప్పే రుద్రాక్షలంటే ఆయనకెంతో ప్రీతి. 

Also Read: మౌని అమావాస్యరోజు రాజస్నానం ఇలా చేయాలి - కుంభమేళాలో ఈరోజు అత్యంత ప్రత్యేకం!

పంచాక్షరి జపం చేస్తే చాలు భోళాశంకరుడు కరిగిపోతాడు. 

రంగురంగుల పూలతో అవసరం లేదు..ఒకే ఒక బిల్వదళం శివలింగంపై వేస్తే చాలు కరుణించేస్తాడు

శివరాత్రి రోజు ప్రదోష సమయంలో శివనామస్మరణ, శివదర్శనం చేస్తే  చేస్తే విశేష ఫలితం లభిస్తుంది

పరమ శాంతినిచ్చేది శివనామస్మరణకు అందరూ అర్హులే. 

 ఉప మాపేపిశత్తమః కృష్ణం వ్యవక్తమస్థిత్!
ఉష ఋణేవ యాతయ!!

రాత్రి అంటే ఆనందదాయిని అన్నింటికి ఆశ్రయం ఇవ్వగలది అని అర్థం. అందుకే మహాశివరాత్రి వ్రతాన్ని రాత్రిపూట జరుపుకుంటారు. అందులోనూ కృష్ణపక్షం చతుర్దశి రోజు వచ్చిన రాత్రికి ఓ ప్రత్యేకత ఉంది. చతుర్దశి రోజు ఎవరైతే శివపూజను చేస్తారో, ఆ రాత్రి జాగరణ పాటిస్తారో వారికి మళ్లీ భూమ్మీద జన్మించే అవకాశం రాదు..అంటే జీవన్ముక్తుడు అవుతాడని అర్థం. అంత మహిమాన్వితమైనది శివపూజ 

శివంతు పూజయత్వా యోజా గర్తిచ చతుర్దిశీం!
మాతుః పయోధర రసం నపిబేత్ స కదాచన!!

శివరాత్రి అంత గొప్పది కాబట్టే గరుడ, స్కంద, పద్మ అగ్ని పురాణాల్లో దీని గురంచి ప్రత్యేకంగా ప్రశంసించడం జరిగింది. చెప్పే విధానంలో వ్యత్యాసం ఉండచ్చేమో కానీ విషయం మాత్రం ఒకటే. శివరాత్రి రోజు ఎవరైతే ఉపవాసం, జాగరణ చేసి బిల్వ పత్రాలతో పూజ చేస్తారో వారికి నరకబాధలు ఉండవు. శివుడు ఆనందాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తాడు.

ఈ ఏడాది మహా శివరాత్రి ఫిబ్రవరి 26 న వచ్చింది....

Also Read: జ్యోతిర్లింగాలను ఒకే ట్రిప్​లో ఎలా కవర్​ చేయొచ్చో తెలుసా? హైదరాబాద్​ నుంచి ఇలా స్టార్ట్ అయిపోండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 SRH VS LSG Result Update :  SRH కి LSG రిటర్న్ గిఫ్ట్.. గతేడాది ఓటమికి ఘనంగా బదులు తీర్చుకున్న లక్నో.. పూరన్ విధ్వంసం.. హైదరాబాద్ కు తొలి ఓటమి
 SRH కి LSG రిటర్న్ గిఫ్ట్.. గతేడాది ఓటమికి ఘనంగా బదులు తీర్చుకున్న లక్నో.. పూరన్ విధ్వంసం.. హైదరాబాద్ కు తొలి ఓటమి
Pawan Kalyan Review: శాంతిభద్రతలపై డీసీఎం పవన్ సమీక్ష- పోలీసులకు స్ట్రాంగ్ వార్నింగ్
శాంతిభద్రతలపై డీసీఎం పవన్ సమీక్ష- పోలీసులకు స్ట్రాంగ్ వార్నింగ్
YSRCP: సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవరెడ్డిలకు ముందస్తు బెయిల్ - పోసాని కేసులో ఇచ్చిన హైకోర్టు
సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవరెడ్డిలకు ముందస్తు బెయిల్ - పోసాని కేసులో ఇచ్చిన హైకోర్టు
Polavaram: గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి - ముందే నిర్వాసితులకు పరిహారం - చంద్రబాబు కీలక ప్రకటనలు
గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి - ముందే నిర్వాసితులకు పరిహారం - చంద్రబాబు కీలక ప్రకటనలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SRH vs LSG Match Preview IPL 2025 | నేడు సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ | ABPKL Rahul Joins Delhi Capitals | నైట్ పార్టీలో నానా హంగామా చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ | ABP DesamRC 16 Ram Charan Peddi First Look | రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా RC16 టైటిల్, ఫస్ట్ లుక్ | ABP DesamRiyan Parag Fan touches Feet | రియాన్ పరాగ్ కాళ్లు మొక్కిన అభిమాని | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 SRH VS LSG Result Update :  SRH కి LSG రిటర్న్ గిఫ్ట్.. గతేడాది ఓటమికి ఘనంగా బదులు తీర్చుకున్న లక్నో.. పూరన్ విధ్వంసం.. హైదరాబాద్ కు తొలి ఓటమి
 SRH కి LSG రిటర్న్ గిఫ్ట్.. గతేడాది ఓటమికి ఘనంగా బదులు తీర్చుకున్న లక్నో.. పూరన్ విధ్వంసం.. హైదరాబాద్ కు తొలి ఓటమి
Pawan Kalyan Review: శాంతిభద్రతలపై డీసీఎం పవన్ సమీక్ష- పోలీసులకు స్ట్రాంగ్ వార్నింగ్
శాంతిభద్రతలపై డీసీఎం పవన్ సమీక్ష- పోలీసులకు స్ట్రాంగ్ వార్నింగ్
YSRCP: సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవరెడ్డిలకు ముందస్తు బెయిల్ - పోసాని కేసులో ఇచ్చిన హైకోర్టు
సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవరెడ్డిలకు ముందస్తు బెయిల్ - పోసాని కేసులో ఇచ్చిన హైకోర్టు
Polavaram: గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి - ముందే నిర్వాసితులకు పరిహారం - చంద్రబాబు కీలక ప్రకటనలు
గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి - ముందే నిర్వాసితులకు పరిహారం - చంద్రబాబు కీలక ప్రకటనలు
Telangana Assembly: కక్ష కట్టి ఉంటే ఫ్యామిలీతో చర్లపల్లిలో ఉండేవాళ్లు - కేటీఆర్‌కు రేవంత్ కౌంటర్
కక్ష కట్టి ఉంటే ఫ్యామిలీతో చర్లపల్లిలో ఉండేవాళ్లు - కేటీఆర్‌కు రేవంత్ కౌంటర్
Nicholas Pooran:పోర్లు! సిక్స్‌లు! నికోలస్ పూరన్ విశ్వరూపం, ఐపీఎల్ 2025లో ఫాస్టెస్ట్‌ హాఫ్ సెంచరీ
పోర్లు! సిక్స్‌లు! నికోలస్ పూరన్ విశ్వరూపం, ఐపీఎల్ 2025లో ఫాస్టెస్ట్‌ హాఫ్ సెంచరీ
SRH vs LSG: ఉప్పల్‌లో సీన్ రివర్స్‌- హైదరాబాద్‌ బౌలింగ్‌ను చితక్కొడుతున్న లక్నో బ్యాటర్లు
ఉప్పల్‌లో సీన్ రివర్స్‌- హైదరాబాద్‌ బౌలింగ్‌ను చితక్కొడుతున్న లక్నో బ్యాటర్లు
Pawan Kalyan: పిఠాపురం రూపు మారేలా అభివృద్ధి పనులు - అధికారులుక పవన్ కల్యాణ్ దిశానిర్దేశం
పిఠాపురం రూపు మారేలా అభివృద్ధి పనులు - అధికారులుక పవన్ కల్యాణ్ దిశానిర్దేశం
Embed widget