Kumbh Mela Third Raja Snanam: మౌని అమావాస్యరోజు రాజస్నానం ఇలా చేయాలి - కుంభమేళాలో ఈరోజు అత్యంత ప్రత్యేకం!
mahakumbh 2025 : మహాకుంభమేళాలో రాజస్నానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇప్పటికే రెండు రాజస్నానలు పూర్తయ్యాయి. మూడో రాజస్నానం తేదీ, వివరాలు ఇక్కడ తెలుసుకోండి...

Kumbh Mela Third Raja Snanam : భారతదేశంలో ఇప్పుడు జరుగుతున్న అతిపెద్ద ఉత్సవం మహా కుంభమేళా. కుంభమేళాలో రాజస్నానాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది.
2025 జనవరి 13న కుంభమేళా ప్రారంభం రోజైన పుష్యమాస పూర్ణిమ రోజు మొదటి రాజస్నానం ఆచరించారు
జనవరి 14 మకర సంక్రాంతి రోజు రెండో రాజస్నానం ఆచరించారు
మూడో రాజ స్నానం - 2025 జనవరి 29 మౌని అమావాస్య (Mauni Amavasya 2025) .. ఈ రోజు కుంభమేళాలో స్నానం ఆచరించడం అత్యంత విశేషం, పుణ్యఫలం.
జనవరి 29న పుష్య బహుళ అమావాస్యను మౌని అమావాస్యగా జరుపుకుంటారు. ఈ రోజు చేసేస్నానం, దానాలకు విశిష్ట స్థానం ఉంది. ఈ రాజ స్నానం చేసే శుభ సమయం సాయంత్రం 5.25 నుంచి ప్రారంభమై 6:18 గంటల వరకు ఉంటుంది.
Also Read: జనవరి 29 మౌని అమావాస్య..ఈ రోజు రావిచెట్టు దగ్గర దీపం వెలిగిస్తే!
మౌని అమావాస్యనే చొల్లంగి అమావాస్య అని అంటారు. పూర్వీకులకు మోక్షాన్ని ప్రసాదించే ఈ అమావాస్య రోజున చేసే నదీ స్నానానికి అత్యంత విశిష్టత ఉంది. సాధారణంగా మౌని అమావాస్య రోజున చేసే నదీస్నానం, శ్రాద్ధం వంటి కర్మలతో పూర్వీకుల అనుగ్రహంతో లభిస్తుందని.. పితృ దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. అందుకే ఏడాదిలో వచ్చే 12 అమావాస్యల్లో పుష్య మాస అమావాస్య చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. మహా కుంభ మేళా, మౌని అమావాస్యల కలయిక అంటే ఆ ఫలితాన్ని ఊహించలేం అంటారు పండితులు.
మహా కుంభ మేళాలో రాజ స్నానం చేసే వారు ముందుగా నదికి నమస్కరించి నీటిలోకి దిగాలి. నది ఒడ్డు నుంచి కొంత మట్టిని తీసుకెళ్లి నదిలో కలిపి మరోసారి నమస్కరించాలి. ముక్కుమూసుకుని మూడుసార్లు మునిగి లేచిన తర్వాత.. దోసిలితో నీరు తీసుకుని సంకల్పం చెప్పుకుని సూర్యుడికి సమర్పించాలి. ఈ సమయంలో తూర్పువైపు తిరిగి స్నానమాచరించాలి. నదింలోంచి బయటకు వచ్చిన తర్వాత పసుపు, కుంకుమ, పూలు సమర్పించాలి. కార్తీకమాసంలో దీపాలు వదిలినట్టే అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించి నదిలో విడవాలి. శాస్త్రోక్తంగా నదీస్నానం పూర్తి చేసిన తర్వాత నది తీరంలో పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే పితృదేవతలు సంతోషించి వంశాభివృద్ధి కలుగుతుంది.
Also Read: జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు తేదీలివే!
సాధారణంగా మౌనీ అమావాస్య రోజు చేసే దానాలకు విశేష ఫలితం లభిస్తుంది. ఇక మౌని అమావాస్య రోజు కుంభమేళాలో చేసే అన్నదానం, వస్త్రదానం, గోదానం ఉత్తమ ఫలితాలనిస్తాయి.
కుంభమేళాలో నాలుగో రాజ స్నానం ఫిబ్రవరి 03 వసంతపంచమి రోజు
కుంభమేళాలో ఐదో రాజస్నానం ఫిబ్రవరి 04 అచల నమవి
కుంభమేళాలో ఆరో రాజస్నానం ఫిబ్రవరి 12 మాఘ పూర్ణమి
కుంభమేళాలో ఏడో రాజస్నానం - చివరిది.. ఫిబ్రవరి 26 మహా శివరాత్రి
Also Read: ఫిబ్రవరి 26 or 27.. మహా శివరాత్రి ఎప్పుడు - మిగిలిన దేవుళ్ల కన్నా శివుడు ఎందుకు ప్రత్యేకం!
నవగ్రహ ధ్యాన శ్లోకం
ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ ।
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ॥
శనిః
నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్ ।
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమ్ ॥






















