చాణక్య నీతి: మీరు ఏం ఇస్తే అదే తిరిగి వచ్చేస్తుంది!

ఆత్మాపరాధ వృక్షన్య సలాన్యేతాని దేహినామ్
దారిద్ర్యయరోగ దుఃఖాని బన్ధనవ్యసనానిచ

ఏం విత్తితే అదే ఫలం వస్తుందంటారు పెద్దలు..ఆ విషయాన్ని ఈ శ్లోకంలో స్పష్టంగా చెప్పారు ఆచార్య చాణక్యుడు

విత్తనం ఒకటి నాటితే మొక్క మరొకటి రాదు కదా..అలానే మీరు ఏం చేశారో దానికి తగిన ఫలితమే పొందుతారు

డబ్బు లేకపోవడం, దారిద్ర్యం అనుభవించడం, బాధ పడడం ..ఇవన్నీ మనిషి చేసుకున్న కర్మ ఫలాలు

తప్పులు , నేరాలు , మోసాలు చేస్తే అలాంటి ఫలితాలే పొందుతారు

ఎదుటివారితో చెడుగా ప్రవర్తించినా,మాట్లాడినా అవే మీకు తిరిగి వస్తాయి

మీరు మంచి చేస్తే మంచి ఫలితాలే పొందుతారు..మంచి మాట్లాడితే మర్యాద నిలుపుకుంటారు

అందుకే ఎప్పుడూ మంచి పనులే చేయాలి..మంచి వాక్కులే పలకాలని చాణక్యుడు బోధించారు