పాలు పొంగించే శుభముహూర్తం ఎప్పుడు!
ఈ ఏడాది 2025 లో రథసప్తమి ఫిబ్రవరి 04 న వచ్చింది...
సూర్యోదయానికి సప్తమి తిథి లేకపోవడంతో రథ సప్తమి ఎప్పుడు అనే గందరగోళం ఉంది
ఫిబ్రవరి 04 మంగళవారం ఉదయం 7.55 వరకూ షష్టి తిథి ఉంది..ఆ తర్వాత సప్తమి మొదలైంది
ఫిబ్రవరి 04 రాత్రి తెల్లవారితే ఫిబ్రవరి 05 బుధవారం 5.29 వరకూ సప్తమి ఉంది..ఈ రోజు కూడా సూర్యోదయానికి తిథి లేదు
ఫిబ్రవరి 05 ఉదయం సూర్యోదయ సమయం 6.36.. సూర్యోదయానికి సప్తమి తిథి ముగిసి అష్టమి వచ్చేసింది
అందుకే ఫిబ్రవరి 04 మంగళవారమే రథ సప్తమి జరుపుకోవాలి...ఇందులో ఎలాంటి సందేహానికి అవకాశం లేదు
ఫిబ్రవరి 04 మంగళవారం ఉదయం 8 గంటల తర్వాత పాలు పొంగించి సూర్యుడి పూజ చేసుకోవచ్చు
ఉదయం 8.52 నుంచి 9.30 వరకూ దుర్మూహూర్తం ఉంది..ఈలోగానే పూజ చేసేసుకుంటే మంచిది