Mahesh Babu : మోస్ట్ హ్యాండ్సమ్ టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా ?
Mahesh Babu : మహేష్ బాబు రోజురోజుకీ మరింత హ్యాండ్సమ్ గా, ఫిట్ గా కన్పిస్తున్నారు. ఆయన లుక్ చూస్తే ఎవ్వరైన పడిపోవాల్సిందే. మరి మహేష్ బాబు ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా ?

Mahesh Babu Fitness Secret : సూపర్ స్టార్ మహేష్ బాబు అందం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నాలుగు పదుల వయసు దాటినప్పటికీ ఆయన ఇంకా పాతికేళ్ల కుర్రాడిలా అందంగా కనిపిస్తారు. ఇప్పటికీ ఎంతో మంది అమ్మాయిలకి ఆయన కలల రాకుమారుడు అంటే అతిశయోక్తి కాదేమో. అయితే టాలీవుడ్ లోనే మోస్ట్ హాండ్సమ్ ప్రిన్స్ గా పేరు తెచ్చుకున్న మహేష్ బాబు గ్లామర్ సీక్రెట్ ఏంటి ? అనేది ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. అయితే అది తన తండ్రి నుంచి వచ్చిన జీన్స్ అనే మాట వాస్తవమే.
తండ్రికి తగ్గ తనయుడు
అందంలో, నటనలో మహేష్ బాబు తండ్రికి తగ్గ తనయుడు. నిజానికి ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ ముందు ఇతర హీరోలు దిగదుడుపే. కేవలం ఈ ఏజ్ లో కూడా ఇలాంటి లుక్ మెయింటైన్ చేయాలంటే జీన్స్ వల్ల మాత్రమే అని చెప్పలేము. అయితే సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు ఫిట్నెస్ ను మెయింటైన్ చేయడానికి స్పెషల్ గా డైట్ మీటింగ్ చేయడంతో పాటు, పలు వర్కర్స్ కూడా చేస్తారనే సంగతి తెలిసిందే. మరి సూపర్ స్టార్ మహేష్ బాబు అందం తిన్నారా? అన్నట్టుగా ఉండడానికి గల కారణం ఏంటి? అనే సమాచారం తాజాగా బయట కొచ్చింది.
రాజమౌళి మూవీలో అందుకే ఛాన్స్
40 ఏళ్ల వయసు దాటినప్పటికీ మహేష్ బాబు టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోలకు తన అందంతో గట్టి పోటీ ఇస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఇండియన్ చిత్ర సినిమాలోని ఇంతటి అందగాడు లేడు అనేది కాదనలేని నిజం. అందుకేనేమో రాజమౌళి సైతం పాన్ వరల్డ్ మూవీ SSMB29 కోసం మహేష్ బాబును హీరోగా తీసుకున్నారు. ఇది వేరే టాపిక్ అనుకోండి. కానీ మహేష్ బాబు హ్యాండ్సమ్ గా ఉండడం మూవీకి ప్లస్ పాయింటే కదా. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు డైట్ సీక్రెట్ ఏంటి అన్నది ఇన్ని రోజులూ ఎవ్వరికి పెద్దగా తెలియదు. ఎట్టకేలకు ఆయన ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో బయట పడింది. మహేష్ బాబు స్పెషల్ గా ఓ డైట్ ని మెయింటైన్ చేస్తారు. అది సామాన్యులకు ఫాలో అవ్వడం దాదాపు అసాధ్యమని చెప్పాలి.
మహేష్ బాబు డైట్ సీక్రెట్ ఇదే
మహేష్ బాబు డైట్ లో రోజుకు ఆరు ఏడుసార్లు కొంచెం కొంచెం తింటారట. అంతేకాకుండా బ్రెడ్, షుగర్, పాల పదార్థాలు, డీప్ ఫ్రై ఫుడ్ కి చాలా దూరంగా ఉంటారట. అయితే అందంగా ఉండాలంటే కేవలం డైట్ మాత్రమే సరిపోదు. సాయి పల్లవి చెప్పినట్టుగా గ్లో లోపల నుంచి వస్తుంది. అలా రావాలంటే మనసు, మైండ్ రెండూ ప్రశాంతంగా ఉండాలి. అలా ఉండడానికి మహేష్ బాబు మెంటల్ డిటాక్స్, బాడీ డిటాక్స్ వంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటారట. అలాగే ఎప్పుడైనా షూటింగ్ లేకపోతే దాదాపు గంట పాటు ఆయన రన్నింగ్ చేస్తారట. ఇక సినిమాకు తగ్గట్టుగా వ్యాయామం ఎలాగో ఉండనే ఉంటుంది. ఇదన్నమాట మహేష్ బాబు గ్లోయింగ్ ఫిట్నెస్ వెనకున్న సీక్రెట్.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

