నాగ చైతన్య హీరోగా వెంకట్ ప్రభు తీసిన సినిమా 'కస్టడీ'. ఇది ఎలా ఉందంటే... మినీ రివ్యూలో తెలుసుకోండి

కథ : కానిస్టేబుల్ శివ (నాగ చైతన్య), రేవతి (కృతి శెట్టి) ప్రేమికులు. కులాలు వేరు కావడంతో అమ్మాయి ఇంట్లో పెళ్ళికి ఒప్పుకోరు.

రేవతి ఇంటికి శివ బయలు దేరితే... రౌడీ రాజు (అరవింద్ స్వామి), సీబీఐ అధికారి జార్జ్ (సంపత్ రాజ్) కారుతో ఢీ కొడతారు. 

జార్జ్, రాజును అరెస్ట్ చేసి స్టేషనుకు తీసుకు వెళతాడు శివ. వాళ్ళను చంపమని సీఎం దాక్షాయణి (ప్రియమణి) ఆదేశిస్తుంది. 

పోలీసులు, రౌడీల నుంచి రాజును శివ ఎందుకు కాపాడాడు? వాళ్ళ కథ ఏమిటి? అనేది సినిమా. 

ఎలా ఉంది? : వెంకట్ ప్రభు శైలికి భిన్నంగా, చాలా నిదానంగా సాగే చిత్రమిది. కొన్ని ఎపిసోడ్స్ తప్ప ఎంగేజ్ చేసే స్క్రీన్ ప్లే లేదు.

ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అసలు బాలేదు. నేపథ్య సంగీతంలో బలం లేదు.

శివ పాత్రకు చైతూ న్యాయం చేశాడు. కానిస్టేబుల్‌గా ఒదిగిపోయారు. ఫ్లాష్‌బ్యాక్‌లో ఆయన స్టైల్ బావుంది.

రాజుగా అరవింద్ స్వామి ఇరగదీశారు. ఆయన స్టైల్, డైలాగ్స్ నవ్విస్తాయి. డార్క్ హ్యూమర్ వర్కవుట్ అయ్యింది.

కృతి శెట్టి పాత్రకు ప్రాముఖ్యత లేదు. మిగతా నటీనటులు ఓకే. కానీ, మెమరబుల్ పెర్ఫార్మన్స్ లు లేవు.

కథగా చూస్తే 'కస్టడీ' రివేంజ్ డ్రామా. ఫ్లాష్ బ్యాక్, క్లైమాక్స్ ట్విస్ట్ రొటీన్. పైగా, సీన్లు సాగదీయడంతో బోర్ కొడుతుంది.

'కస్టడీ'తో చైతూ ఖాతాలో మరో ఫ్లాప్ పడింది. అక్కినేని ఫ్యాన్స్ ఆశించే హిట్ కోసం మరో ప్రయత్నం చేయాలి.