నాగ చైతన్య హీరోగా వెంకట్ ప్రభు తీసిన 'కస్టడీ' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా జరిగింది? చైతు ముందు ఎన్ని కోట్ల టార్గెట్ ఉంది? 'కస్టడీ' నైజాం థియేట్రికల్ రైట్స్ రూ. 7.50 కోట్లకు విక్రయించారు. సీడెడ్ రైట్స్ ద్వారా 'కస్టడీ' నిర్మాతకు రూ. 2.20 కోట్లు వచ్చాయి. ఆంధ్రలో అన్ని ఏరియాలు కలిపి రూ. 8.50 కోట్లకు అమ్మారట. ఏపీ, తెలంగాణ కలిపితే... థియేట్రికల్ రైట్స్ ద్వారా రూ. 18.20 కోట్లు వచ్చాయి. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా కలిపి రూ. 1.40 కోట్లు వచ్చాయని సమాచారం. ఓవర్సీస్ రైట్స్ ద్వారా 'కస్టడీ' నిర్మాతకు రూ. 2.40 కోట్లు వచ్చాయి. 'కస్టడీ' టోటల్ వరల్డ్ వైడ్ థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే... రూ. 22 కోట్లు జరిగిందని ట్రేడ్ టాక్. ఇప్పుడు నాగ చైతన్య ముందు ఉన్న టార్గెట్ రూ. 22.50 కోట్లు! అంత షేర్ వస్తే సినిమా ప్రాఫిట్ జోన్ లోకి వెళుతుంది. అక్కినేని హీరోల ఫ్లాపుల పరంపరకు 'కస్టడీ' బ్రేకులు వేస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.