ప్రభాస్ 'ఆదిపురుష్' ట్రైలర్ విడుదలైంది. ఇందులో ప్లస్, మైనస్ పాయింట్స్ ఏంటి? డైలాగ్స్ ఎలా ఉన్నాయి? ఓ లుక్ వేయండి!

'ఇది నా రాముని కథ. ఆయన మనిషిగా పుట్టి భగవంతుడు అయిన మహనీయుడు' అని హనుమంతుడు చెప్పే మాటతో ట్రైలర్ మొదలైంది. 

'మనం జన్మతో కాదు... చేసే కర్మతో చిన్నా పెద్దా అవుతాం' - శ్రీరామునిగా ప్రభాస్ 

'నా కోసం పోరాడొద్దు. వేల సంవత్సరాల తర్వాత తల్లులు మీ వీరగాథను చెబుతూ పిల్లల్ని పెంచాలి. ఆ రోజు కోసం పోరాడండి' - ప్రభాస్   

'పోరాడతారా? అయితే దూకండి ముందుకు! అహంకారం రొమ్ము చీల్చి ఎగురుతున్న విజయ ధ్వజాన్ని పాతండి' - ప్రభాస్   

'మీకు వదినమ్మ ప్రాణాల కన్నా మర్యాదే అధిక ప్రియమైనదా?' - శ్రీరామునికి లక్ష్మణుడి ప్రశ్న. 

'నా ప్రాణమే జానకిలో ఉంది. కానీ, నా ప్రాణాల కన్నా మర్యాదే అధిక ప్రియమైనది' - శ్రీరామునిగా ప్రభాస్ 

'రాఘవ నన్ను పొందడానికి శివ ధనుస్సు విరిచాడు.  ఇప్పుడు రావణుడి గర్వాన్ని విరిచేయాలి' - సీతా దేవిగా కృతి సనన్ 

'నువ్వు రాక్షసుడివే! లక్ష్మిని సొంతం చేసుకో... నారాయణుడివి అయిపోతావ్!' - రావణుడితో ఒకరు 

'ఆయన (శ్రీరాముని) జీవితం ధర్మానికి, సన్మార్గానికి నిదర్శనం' - హనుమంతుడు

'ఆయన (శ్రీరాముని) ధర్మం అధర్మానికి ఉన్న అహంకారాన్ని అంతం చేసింది. ఇది ఆ రఘునందనుడి గాథ' - హనుమంతుడు

టీజర్ కంటే ట్రైలర్ లో గ్రాఫిక్స్ బావున్నాయని ఆడియన్స్, ఫ్యాన్స్ అంటున్నారు.

Thanks for Reading. UP NEXT

మాళవిక యాబ్స్ - విక్రమ్ 'తంగలాన్' యాక్షన్ కోసమే

View next story