'విమానం'లో అనసూయ ప్రధాన పాత్ర చేశారు. రోల్ పేరు సుమతి. ఇందులో మిగతా నటీనటులు ఎవరు? అనేది చూడండి. 'విమానం'లో సముద్రఖని మరో ప్రధాన పాత్ర చేశారు. అంగవైకల్యం ఉన్న తండ్రి పాత్రలో ఆయన కనిపించనున్నారు. సముద్రఖని పాత్ర పేరు వీరయ్య. ఆయన కుమారుడి పాత్రలో మాస్టర్ ధ్రువన్ యాక్ట్ చేస్తున్నారు. కోటి పాత్రలో చెప్పులు కుట్టే వ్యకిగా రాహుల్ రామకృష్ణ కనిపించనున్నారు. ఆటో డ్రైవర్ డేనియల్ పాత్రలో నటుడు ధన్ రాజ్ నటించారు. ఆయన ఫస్ట్ లుక్ ఇది. హీరోయిన్ మీరా జాస్మిన్ 'విమానం' సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇంకా ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేయలేదు. 'విమానం'లో రాజేంద్రన్ పాత్రలో మొట్ట రాజేంద్రన్ నటించారు. ఆయన ఫస్ట్ లుక్ ఇది. వరుణ్ తేజ్ 'గని' చిత్రానికి దర్శకత్వం వహించిన కిరణ్ కొర్రపాటి, జీ స్టూడియోస్ సంస్థతో కలిసి చిత్రాన్ని నిర్మించారు. తండ్రీ కుమారుల అనుబంధం, విమానంలో విహరించాలని కుమారుడి ఆశ నేపథ్యంలో సినిమా రూపొందింది. జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది సినిమా. (All Images Courtesy : Vimanam Movie)