విక్రమ్, ఐశ్వర్యారాయ్, త్రిష, కార్తీ, జయం రవి నటించిన 'పొన్నియిన్ సెల్వన్ 2'కు తెలుగులో ఫస్ట్ పార్ట్ కంటే మంచి పేరు వచ్చింది. తెలుగులో 'పొన్నియిన్ సెల్వన్ 2' (Ponniyin selvan 2 collections) ఎలా ఉన్నాయి అనేది చూస్తే... మొదటి రోజు నైజాంలో రూ. 80 లక్షలు, సీడెడ్ లో రూ. 13 లక్షలు కలెక్ట్ చేసిందట. ఏపీలో అన్ని ఏరియాలు కలిపి రూ. 44 లక్షలు కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాల టాక్. తెలుగు రాష్ట్రాల్లో 'పొన్నియిన్ సెల్వన్ 2' రూ. 1.40 కోట్ల షేర్ (రూ. 2.80 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేసింది. 'పొన్నియిన్ సెల్వన్ 2' తమిళనాడులో రూ. 17 కోట్ల గ్రాస్, కర్ణాటకఓ రూ. 4 కోట్ల గ్రాస్, కేరళలో రూ. 2.85 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందట. రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.55 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే... ఓవర్సీస్ మార్కెట్లలో రూ. 24.70 కోట్లతో దుమ్ము దులిపింది. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 'పొన్నియిన్ సెల్వన్ 2' మొదటి రోజు గ్రాస్ రూ. 54 కోట్లు. 'పొన్నియిన్ సెల్వన్ 2' సుమారు రూ. 175 కోట్లు కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుందట.