'ఏజెంట్'కు వైల్డ్ ఓపెనింగ్స్ వచ్చాయని నిర్మాణ సంస్థ పేర్కొంది. ట్రేడ్ వర్గాల లెక్కలో ఓపెనింగ్స్ ఎన్ని కోట్లు? అంటే... 'ఏజెంట్' నైజాంలో రూ. 1.33 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే... 64 లక్షలతో సీడెడ్ సరిపెట్టుకుంది. ఉత్తరాంధ్రలో రూ. 54 లక్షలు, తూర్పు గోదావరిలో రూ. 29 లక్షలు, పశ్చిమ గోదావరిలో రూ. 30 లక్షలు వచ్చాయట. గుంటూరులో రూ. 52 లక్షలు, కృష్ణాలో రూ. 22 లక్షలు, నెల్లూరులో రూ. 16 లక్షలు వచ్చాయట. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి రూ. 4 కోట్ల షేర్ రాగా... గ్రాస్ రూ. 6.60 కోట్లు అని ట్రేడ్ వర్గాల టాక్. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియాలో రూ. 30 లక్షలు, ఓవర్సీస్ మార్కెట్ లో రూ. 65 కోట్లు కలెక్ట్ చేసిందట. ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 'ఏజెంట్' రూ. 4.95 కోట్ల షేర్, రూ. రూ.8.60 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. 'ఏజెంట్' ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారు రూ. 37 కోట్లు. థియేటర్లలో అంత కలెక్ట్ చేస్తే గానీ బ్రేక్ ఈవెన్ కాదు.