మెగా డాటర్ నిహారికా కొణిదెల నటి మాత్రమే కాదు... ఆమెలో నిర్మాత కూడా ఉన్నారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన నిహారిక... 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ', 'ముద్ద పప్పు ఆవకాయ్' ప్రొడ్యూస్ చేశారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ కోసం నిహారిక కొత్త ఆఫీస్ తీసుకున్నారు. పూజా కార్యక్రమాలతో గురువారం పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ కొత్త ఆఫీస్ మొదలు అయ్యింది. నిహారికా కొణిదెల తల్లిదండ్రులు నాగబాబు, పద్మజ ఆఫీస్ ప్రారంభోత్సవానికి విచ్చేశారు. కుమార్తెను ఆశీర్వదించారు. నిహారిక అన్నయ్య, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ కొత్త ఆఫీస్ ప్రారంభోత్సవంలో సందడి చేశారు. నటుడు టెంపర్ వంశీ, మరికొంత మంది నిహారిక నిర్మాణ సంస్థకు వచ్చి విషెష్ చెప్పారు. కొత్త ఆఫీస్ ఓపెన్ చేయడమే కాదు... కొత్త కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తామని నిహారిక తెలిపారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మీద వెబ్ సిరీస్ లతో పాటు సినిమాలు కూడా తీయడానికి నిహారిక ప్లాన్ చేశారట. నిహారికా కొణిదెల (All Images Courtesy : Niharika Konidela, Pink Elephant Pictures / Instagram)