'పొన్నియిన్ సెల్వన్' తమిళనాడులో సూపర్ హిట్. మిగతా భాషల్లో ఆడలేదు. ఇప్పుడు సెకండ్ పార్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా జరిగింది? అనేది చూస్తే...

మణిరత్నం రెండో పార్టుతో మళ్ళీ తమిళ ప్రేక్షకులను మాత్రమే మెప్పిస్తారో? లేదంటే అందర్నీ ఆకట్టుకుంటారో చూడాలి. 

'పొన్నియిన్ సెల్వన్ 2'ను తమిళనాడులో లైకా ప్రొడక్షన్స్ సొంతంగా విడుదల చేస్తోంది. థియేట్రికల్ రైట్స్ 80 కోట్లుగా లెక్క కట్టారట. 

తెలుగులో 'పొన్నియిన్ సెల్వన్ 2'ను 'దిల్' రాజు, శిరీష్ విడుదల చేస్తున్నారు. రైట్స్ 10 కోట్లు మాత్రమే అని టాక్.

'పొన్నియిన్ సెల్వన్' కేరళలో బాగా ఆడింది. దాంతో రెండో పార్ట్ రైట్స్ రూ. 9 కోట్లు పలికాయట. 

'పొన్నియిన్ సెల్వన్ 2' హిందీ, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా రైట్స్ కలిసి రూ. 21 కోట్లు అని తెలిసింది.

ఓవర్సీస్ రైట్స్ ద్వారా 'పొన్నియిన్ సెల్వన్ 2'కు మంచి డబ్బులు వచ్చాయి. ఆల్మోస్ట్ 50 కోట్లకు డీల్ క్లోజ్ అయ్యింది. 

'పొన్నియిన్ సెల్వన్ 2' టోటల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ 170 కోట్లు అని ట్రేడ్ వర్గాల టాక్.

ఇప్పుడు 'పొన్నియిన్ సెల్వన్ 2' ముందు ఉన్న టార్గెట్ రూ. 300 కోట్లు! గ్రాస్ అంత వస్తే అందరూ సేఫ్.

లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ ధైర్యంగా డబ్బులు పెట్టడంతో 'పొన్నియిన్ సెల్వన్' రెండు పార్ట్స్ వచ్చాయి.