లేటు వయసులో ఘాటు ప్రేమలో పడిన బాలీవుడ్ భామల్లో మలైకా అరోరా ఒకరు. ప్రియుడు అర్జున్ కపూర్ కోసం మీరు ఎప్పుడైనా వంట చేశారా? అనే ప్రశ్న మలైకా అరోరాకు ఎదురైంది. ఇంట్లో ఎప్పుడూ తానే వంట చేస్తానని మలైకా అరోరా తెలిపారు. అర్జున్ కపూర్ కు వంట రాదని, కనీసం టీ కూడా పెట్టలేదని మలైకా అరోరా రివీల్ చేశారు. తామిద్దరం వంట చేయాల్సిన అవసరం లేదని, తనకు వంట చేయడం ఇష్టమే అని మలైకా అరోరా తెలిపారు. తాను వండిన వంటలు తింటూ అర్జున్ కపూర్ ఎంజాయ్ చేస్తాడని, తనకు అది చాలు అని మలైకా అరోరా పేర్కొన్నారు. కరోనా కాలంలో మలైకా అరోరా కుకింగ్ స్కిల్స్ గురించి ప్రేక్షకులకు తెలిసింది. సల్మాన్ ఖాన్ సోదరుడు, ఫిల్మ్ మేకర్ అర్బాజ్ ఖాన్ తో ఎనిమిదేళ్ల వివాహ బంధానికి మలైకా విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత 2019లో అర్జున్ కపూర్ తో ప్రేమ విషయాన్ని మలైకా అరోరా అనౌన్స్ చేశారు. కరోనా కాలంలో కుకింగ్ వీడియోలు పోస్ట్ చేయడమే కాదు, కొన్ని రెసిపీలూ చెప్పారు. (All Images Courtesy : Malaika Arora Instagram)