'ఆనందో బ్రహ్మ', 'యాత్ర' చిత్రాల దర్శకుడు మహి వి. రాఘవ్ నిర్మించిన వెబ్ సిరీస్ 'సేవ్ ద టైగర్స్'. ఏప్రిల్ 27 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో ఎవరెవరు యాక్ట్ చేశారంటే? 'సేవ్ ద టైగర్స్'లో పాలు అమ్మే బోరబండ వాసిగా, గంటా రవి పాత్రలో ప్రియదర్శి నటించారు. రైటర్ కావాలని ఉద్యోగానికి సెలవు పెట్టి రెండేళ్ల నుంచి ఖాళీగా ఉన్న వ్యక్తిగా అభినవ్ కనిపించనున్నారు. ఒక యాడ్ ఏజెన్సీలో వర్క్ చేసే క్రియేటివ్ పర్సన్ గా చైతన్య కృష్ణ కనిపిస్తారు. ప్రియదర్శి జోడీగా, బ్యూటీ పార్లర్ నడిపే మహిళగా 'జోర్దార్' సుజాత యాక్ట్ చేశారు. అభినవ్ జోడీగా, భర్త ఖాళీగా ఉన్నా అతడి బాగోగులు చూసుకునే డాక్టర్ పాత్రలో పావని గంగిరెడ్డి నటించారు. చైతన్య కృష్ణ జోడీగా, మహిళల హక్కుల కోసం పోరాటం చేసే న్యాయవాది పాత్రలో దేవియాని శర్మ నటించారు. చైతన్యకృష్ణ బాస్ గా హర్షవర్ధన్, కొలీగ్ పాత్రలో నటి సునైనా కనిపిస్తారు. పావని గంగిరెడ్డి స్నేహితుడిగా రాజా, వాళ్ళింట్లో పనిచేసే మహిళగా రోహిణి నటించారు. ప్రియదర్శి తల్లిగా, కోడలికి సపోర్ట్ చేసే అత్త పాత్రలో గంగవ్వ నటించారు. 'సేవ్ ద టైగర్స్'కు నటుడు తేజా కాకుమాను దర్శకత్వం వహించారు. (All Images Courtesy : Disney Plus Hotstar)