అఖిల్ అక్కినేని 'ఏజెంట్' ప్రీ రిలీజ్ బిజినెస్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు ఆయన ముందు ఎంత టార్గెట్ ఉందంటే?

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' ప్రీ రిలీజ్ 18.50 కోట్లు జరిగితే... 'ఏజెంట్' దానికి డబుల్ ఫిగర్స్ రాబట్టింది.

నైజాంలో 'ఏజెంట్' డిస్ట్రిబ్యూషన్ రైట్స్ రూ. 10 కోట్లు అని సమాచారం.

సీడెడ్ రైట్స్ రూ. 4.50 కోట్లకు ఇచ్చారట. 

ఆంధ్ర ఏరియా మొత్తం కలిపి రూ. 14.80 కోట్లు వచ్చాయని తెలిసింది. 

కర్ణాటక అండ్ రెస్టాఫ్ ఇండియా కలిపి రూ. 4 కోట్లకు 'ఏజెంట్' రైట్స్ ఇచ్చారట. 

ఓవర్సీస్ రైట్స్ ద్వారా 'ఏజెంట్' నిర్మాతకు రూ. 3.10 కోట్లు వచ్చాయి.

టోటల్‌గా థియేట్రికల్ రైట్స్ ద్వారా రూ. 36.40 కోట్లు వచ్చాయి. అఖిల్ కెరీర్‌లో సెకండ్ హయ్యస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఇది.

'అఖిల్' ప్రీ రిలీజ్ 42 కోట్లు జరిగింది. దానికి దగ్గరగా 'ఏజెంట్' వచ్చింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 37 కోట్లు!

'ఏజెంట్' సినిమాతో 40 కోట్ల కంటే ఎక్కువ వసూళ్లు రాబడితే అఖిల్ మళ్ళీ టాప్ లీగ్ లోకి రావచ్చు.