హర్రర్ మూవీస్ ఇష్టమా? ఈ తెలుగు సినిమాలు మిస్ కాకుండా చూడండి. నిద్రలో కూడా దెయ్యాలే కనిపిస్తాయి.

ఆమె ఎవరు? (1966): జగ్గయ్య, జయలలిత కీలక పాత్రలు పోషించిన సైకలాజికల్ థ్రిల్లర్ ఇది.

కాష్మోరా(1986): రాజేంద్రప్రసాద్, రాజశేఖర్, భానుప్రియ నటించిన ఈ మూవీని ఒంటరిగా చూడటం కష్టమే.

రాత్రి (1992): రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ చూడాలంటే చాలా ధైర్యం ఉండాలి.

దెయ్యం (1996): ఆర్జీవీ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ చూస్తే రెండు రోజులు నిద్రపోలేరు.

ఆ ఇంట్లో (2009): నటుడు చిన్న స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఒక సెన్సేషనల్.

ప్రేమ కథ చిత్రం (2013): సుధీర్ బాబు, నందితా రాజ్ నటించిన ఈ మూవీ కుర్రకారును అలరించింది.

అవును - 1, 2 (2012, 2015): పూర్ణ, రవి బాబు నటించిన ఈ మూవీ తెలుగు ప్రేక్షకులకు భలే నచ్చేసింది.

రాజుగారి గది (2015): ఓంకార్ దర్శకత్వంలో అశ్విన్ హీరోగా తెరకెక్కిన కామెడీ హర్రర్ మూవీ ఇది.

ఎక్కడికి పోతావు చిన్నవాడా(2016): నిఖిల్, హెబ్బా, నందిత నటించిన ఈ మూవీ కూడా మంచి హిట్ కొట్టింది.

మసూద (2022): తెలుగు ప్రేక్షకులకు సరికొత్త హర్రర్‌ను పరిచయం చేసిన సినిమా ఇది.

విరూపాక్ష (2023): సాయి ధరమ్ తేజ్, సంయుక్త నటించిన ఈ మూవీ కూడా మీకు భలే నచ్చేస్తుంది.

Images Credit: Social Media (Instagram, Facebook and Twitter)