'ఏజెంట్' కోసం అఖిల్ వైల్డ్‌గా మారారు. రొమాంటిక్ ఇమేజ్ వదిలి, ప్యాక్డ్ బాడీతో యాక్షన్ ఫిల్మ్ చేశారు. సినిమా ఎలా ఉంది? కథ : రిక్కీ (అఖిల్)కి ఏజెంట్ కావాలని కోరిక. మూడుసార్లు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పాసై, ఇంటర్వ్యూలో రిజెక్ట్ అవుతాడు. ఏజెంట్ కావడం కోసం 'రా' చీఫ్ మహాదేవ్ (మమ్ముట్టి) దృష్టిలో పడాలని, ఆయన సిస్టమ్ హ్యాక్ చేస్తాడు రిక్కీ. 'ఏజెంట్'గా పనికి రావని చెప్పిన మహాదేవ్, ఎక్స్ ఏజెంట్ ధర్మ (డినో మోరియా)ను అడ్డుకునే మిషన్ రిక్కీ చేతిలో పెడతాడు. మహాదేవ్‌ను రిక్కీ ఎందుకు షూట్ చేశాడు? ధర్మను అడ్డుకుని దేశాన్ని కాపాడాడా? లేదా? అనేది సినిమా. ఎలా ఉంది? పరమ రొటీన్ స్పై థ్రిల్లర్ 'ఏజెంట్'. కథలో, సీన్లలో, టేకింగ్ లో కొత్తగా ఏమీ లేదు. పాటలు కథకు అడ్డు తగిలాయి. సరైన ప్లేస్‌మెంట్ లేదు. రీ రికార్డింగ్, ఎడిటింగ్, సౌండ్ మిక్సింగ్ కూడా బాలేదు. కొన్ని సీన్లు చూస్తే రైటర్ వక్కంతవం వంశీ, దర్శకుడు సురేందర్ రెడ్డి 'రా' మీద మినిమమ్ రీసెర్చ్ చేయలేదని అనిపిస్తుంది. మమ్ముట్టి, డినో మోరియా ఆ పాత్రలకు తగ్గట్టు నటించారు. అయితే, వాళ్ళ రోల్స్ కూడా కొత్తగా లేవు. హీరోయిన్ సాక్షి వైద్యకు నటించే స్కోప్ లేదు. పాటల్లో అందంగా ఉంది. ఆమెకు పాత్రకు తెలంగాణ యాస సెట్ కాలేదు. అఖిల్ సినిమా కోసం కష్టపడ్డాడు. సిక్స్ ప్యాక్ చేసి, హెయిర్ స్టయిల్ చేంజ్ చేసి డిఫరెంట్ గా కనిపించాడు. అఖిల్ ఎంత చేసినా... రొటీన్ కథ, పూర్ టేకింగ్ వల్ల సినిమా ఆడటం కష్టమే.