'సాహో'లో ప్రభాస్‌తో 'బ్యాడ్ బాయ్' సాంగులో స్టెప్పులు వేసిన జాక్వలిన్ ఫెర్నాండేజ్ గుర్తు ఉన్నారా? ఈ ఫోటోలో ఉన్న అందాల భామను కొంచెం చూడండి... 'బ్యాడ్ బాయ్'లో బికినీలో సందడి చేసిన అమ్మాయే. జాక్వలిన్ ఫెర్నాండేజ్ అంటే మోడ్రన్ మహిళ అని ఇమేజ్ ఉంది. ఇప్పుడు ఆమె గిరిజన మహిళగా మారిపోయారు. ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ కోసం జాక్వలిన్ ఇలా ట్రైబల్ అమ్మాయి గెటప్ లోకి వెళ్లారు. 'విక్రాంత్ రోణ' సినిమాలో 'రారా రక్కమ్మ' సాంగ్ నుంచి బాలీవుడ్ హిట్ సాంగ్స్ కి జాక్వలిన్ స్టెప్స్ వేశారట. గిరిజన యువతి ఆహార్యంలో జాక్వలిన్ కొత్తగా ఉన్నారని నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. జాక్వలిన్ శ్రీలంకన్ మూలాలు ఉన్న అమ్మాయి అయినప్పటికీ... బహ్రెయిన్ లో పెరిగారు. జాక్వలిన్ ఫెర్నాండేజ్ బయట మోడ్రన్ గా ఉంటారు. సినిమాల్లోనూ ఎక్కువ మోడ్రన్ రోల్స్ ప్లే చేస్తారు. ఇటీవల జాక్వలిన్ ఫెర్నాండేజ్ పేరు సినిమా వార్తల్లో కంటే క్రిమినల్ వార్తల్లో ఎక్కువ వినబడుతోంది. సుఖేష్ చంద్రశేఖర్, జాక్వలిన్ ఫెర్నాండేజ్ రిలేషన్షిప్ గురించి పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. (All Images Courtesy : Jacqueline Fernandez Instagram)