బౌండ్ స్క్రిప్ట్ లేకుండా సినిమా స్టార్ట్ చేయడం తమ తప్పేనని 'ఏజెంట్' నిర్మాత అనిల్ సుంకర ట్వీట్ చేశారు. 'ఏజెంట్' కాస్ట్లీ మిస్టేక్ అనడమే కాదు, ఫ్యాన్స్‌కు సారీ చెప్పారు అనిల్ సుంకర. ఆ మాటతో సినిమా ఫ్లాప్ అని ఒప్పుకున్నట్లు అయ్యింది. 'ఏజెంట్' బాక్సాఫీస్ బరిలో డిజాస్టర్ కలెక్షన్స్ నమోదు చేసింది. ఓ విధంగా చూస్తే అఖిల్‌కు అవమానమే అంటున్నారు కొందరు. సోమవారం 'ఏజెంట్' కలెక్షన్స్ జస్ట్ 17 లక్షల షేర్ మాత్రమే. మంళవారం మరింత పడిందని ట్రేడ్ టాక్. థియేటర్లలో సోమవారానికి 'ఏజెంట్' సినిమా చతికిలపడింది. 2023లో బిగ్గెస్ట్ డిజాస్టర్లలో 'ఏజెంట్' ఒకటని ట్రేడ్ టాక్. మండేకి ముందు 'ఏజెంట్' కలెక్షన్స్ చూస్తే... ఆదివారం రూ. 43 లక్షల షేర్ కలెక్ట్ చేసింది. 'ఏజెంట్' విడుదలైన రెండో రోజు, శనివారం రూ. 67 లక్షల షేర్ మాత్రమే వచ్చాయి. 'ఏజెంట్' ఓపెనింగ్స్ బావున్నాయ్! మొదటి రోజు సినిమా రూ. 4 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఆ తర్వాత లక్షలకు పడింది. ఫ్రైడే తర్వాత 'ఏజెంట్' కలెక్షన్స్ థియేటర్ల రెంట్ కట్టడానికి కూడా సరిపోవడం లేదని గుసగుస. 'ఏజెంట్' పరాజయానికి దర్శకుడు సురేందర్ రెడ్డి కారణమని ఎక్కువ మంది చెప్పే మాట. ఆ వ్యాఖ్యలకు నిర్మాత ట్వీట్ బలం చేకూర్చింది. ఏది ఏమైనా థియేటర్ల నుంచి సినిమా గోవిందా గోవిందా అని ట్రోల్ చేస్తున్నారు చాలా మంది!