'మళ్ళీ పెళ్లి' ట్రైలర్ చూస్తే పవిత్రతో నరేష్ ప్రేమ, మూడో భార్యతో గొడవలే సినిమా అని అర్థం అవుతోంది. వాళ్ళ బోల్డ్ డైలాగ్స్... 

అయినా... పెళ్ళైన ఆవిడతో మీకు లవ్ ఏంటి సార్? : నరేష్ కు ఎదురైన ప్రశ్న

మీది పడీ పడక లేచే వయసు! ఎప్పుడు లేస్తుందో? ఎప్పుడు పడుతుందో? - నరేష్ తో ఒకరు చెప్పే మాట!

అసలైన సూపర్ స్టార్ పెద్దాయన! బుల్లి సూపర్ స్టార్ పెద్ద భార్య కొడుకు, నరేంద్ర మేడమ్ గారి కొడుకు - అన్నపూర్ణమ్మ డైలాగ్ 

ఇద్దరం ఒకే గదిలో ఉంటున్నా... నా కోరిక తీర్చుకోవడానికి ఐదేళ్లు పట్టింది - పవిత్రతో రవి వర్మ

అయినా నీ కోరికలతో నాకు పనేంటి? నాకూ పుట్టాలి కదా! - రవివర్మతో పవిత్రా లోకేష్

నీతో నాకు రిలేషన్షిప్ ఉందని ఒప్పుకుంటే వాళ్ళు అడిగే మొదటి ప్రశ్న... అంటే ఆవిడను ఉంచుకున్నారా అని! - నరేష్ 

మొగుడిని ఉంచుకుని అతనితో రంకు చేస్తున్నావా? అని ఆమెను అడుగుతారు - నరేష్ 

ఒసేయ్... డోర్ తీయవే! నా మొగుడితో ఏం చేస్తున్నావ్ లోపల! - వనితా విజయ్ కుమార్

ఒక్కసారి పక్కకు వస్తావా? - నరేష్
దేనికి - పవిత్ర
కన్ను కొట్టడం నేర్పిస్తాడట - అన్నపూర్ణమ్మ 

ముసలోడైనా... కనికరించి పెళ్లి చేసుకున్నా! వాడు ఇడియట్ - వనితా విజయ్ కుమార్ (రమ్య రఘుపతి పాత్ర)

అక్కడ కర్ణాటకలో ఇంటింటికీ పాకుతున్న మా ఇంటి పరువును ఏం చేయమంటావ్? - పవిత్రా లోకేష్ 

నన్ను విడాకులు అడగటానికి అతను ఎవరు? నేను ఉంటున్నది నా ఇల్లు. నా అత్తమ్మ నాకు ఇచ్చిన బాధ్యత - వనితా విజయ్ కుమార్ 

'మళ్ళీ పెళ్లి'లో నరేష్, పవిత్రా లోకేష్ (All Images Courtesy : Aditya Music India YouTube)