Budget 2025: కొత్త ఆదాయపు పన్ను స్లాబ్‌ల వల్ల సామాన్యుడికి ఎంత ప్రయోజనం లభిస్తుందో తెలుసా ?
Union Budget 2025: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను శనివారం ప్రవేశపెట్టారు. వేతన జీవులను పెద్ద పరిమాణంలో ఆదాయపు పన్నులో మినహాయింపు ఇచ్చారు.

Budget 2025, New Income Tax Slabs: భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను శనివారం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా, వేతన జీవులను పెద్ద పరిమాణంలో ఆదాయపు పన్నులో మినహాయింపు ఇచ్చారు. తాజాగా రూ.12 లక్షల వరకు ఆదాయం గల వారికి ఒక్క రూపాయి కూడా పన్ను కట్టాల్సిన అవసరం లేదు. అదనంగా రూ.75,000 స్టాండర్డ్ డిడక్షన్ ద్వారా వేతన జీవులను మరో లాభం కూడా ఇచ్చారు. అంటే, ఒక వ్యక్తి రూ.12.75 లక్షల వరకు సంపాదిస్తే, అతనికి ఆదాయపు పన్ను కట్టాల్సిన అవసరం ఉండదు. అయితే, కొత్త టాక్స్ స్లాబ్‌పై కొంతమంది ప్రజలు గందరగోళంలో ఉన్నారు.
కొత్త టాక్స్ స్లాబ్ వివరణ:
2025-26 సంవత్సరానికి కొత్తగా ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను స్లాబ్‌ను పరిశీలించగా.. 0 - 4 లక్షల వరకు ఆదాయంపై పన్ను లేదు, 4 - 8 లక్షలపై 5% పన్ను, 8 - 12 లక్షలపై 10% పన్ను, 12 - 16 లక్షలపై 15% పన్ను, 16 - 20 లక్షలపై 20% పన్ను, 20 - 24 లక్షలపై 25% పన్ను, 24 లక్షలకు పైగా ఆదాయంపై 30% పన్ను అమలు చేయనున్నారు.
Also Read : Budget 2025 Highlights:పాత పన్ను విధానానికి సమాధి- కొత్త విధానంలోకి అందర్నీ రప్పించేందుకు కేంద్రం ఎత్తుగడ
పాత టాక్స్ స్లాబ్ (2024-25)
0-3 లక్షల పై 0%, 3-7 లక్షలపై 5%, 7-10 లక్షలపై 10%, 10-12 లక్షలపై 15%, 12-15 లక్షలపై 20%, 15 లక్షలపై 30% పన్ను అమలులో ఉంది.
పెద్ద ఆదాయదారులకు కూడా ఉపశమనం
గత సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు రూ.12 లక్షలపై అధిక ఆదాయం ఉన్న వారికి కూడా పన్ను తగ్గింది. గతంలో రూ.15 లక్షలకు పైగా ఆదాయంపై 30% పన్ను ఉండేది, కానీ ఇప్పుడు 12-16 లక్షల ఆదాయం ఉన్న వారికి కేవలం 15% పన్ను మాత్రమే ఉంది. 16-20 లక్షలపై 20%, 20-24 లక్షలపై 25%, 24 లక్షలపై 30% పన్ను మాత్రమే ఉంటుంది.
ఇంతకీ 12 లక్షల రూపాయల వరకూ పన్ను మినహాయింపు ఎలా ఉంటుంది? ఈ కథనంలో తెలుసుకుందాం.. ఆదాయపు పన్ను స్లాబ్ ద్వారా పన్ను లెక్కించబడుతుంది. కానీ, వేతన జీవుల కోసం పన్ను మాఫీని 87A సెక్షన్ కింద పొందిన రిబేట్ ద్వారా పొందవచ్చు. 12 లక్షల రూపాయల ఆదాయం ఉన్న వ్యక్తికి స్లాబ్ ప్రకారం 60,000 రూపాయల పన్ను వస్తుంది. కానీ ఈ మొత్తం రిబేట్ కింద మాఫీ అవుతుంది. దీంతో వారు పన్ను లేకుండా ఉంటారు.
ఉదాహరణకు, 13 లక్షల ఆదాయం ఉన్నవారు 0-4 లక్షలపై 0%, 4-8 లక్షలపై 5%, 8-12 లక్షలపై 10%, 12-13 లక్షలపై 15% పన్ను కట్టాలి. అందువల్ల, మొత్తం 75,000 రూపాయల పన్ను అవుతుంది. రూ.14 లక్షల ఆదాయం ఉన్న వారు 90,000 రూపాయలు, రూ.15 లక్షల ఆదాయం ఉన్నవారు 1,05,000 రూపాయలు, రూ.16 లక్షల ఆదాయం ఉన్న వారు రూ.1,20,000 పన్ను కట్టాల్సి ఉంటుంది.
గత స్లాబ్‌తో పోల్చుకుంటే, రూ.16 లక్షల ఆదాయం ఉన్న వారు పాత పన్ను స్లాబ్ ప్రకారం రూ.1,70,000 పన్ను కట్టాల్సి ఉండేది. కానీ, కొత్త స్లాబ్ ప్రకారం ఈ మొత్తం రూ.1,20,000కు తగ్గింది, అంటే పెద్ద ఆదాయదారులకు కూడా పన్ను తగ్గుదల లభించింది. 2025-26 బడ్జెట్‌లో వేతన జీవులకు అనేక ప్రయోజనాలు, పన్ను మినహాయింపులు ఉన్నాయి. రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి పన్ను లేదు, అధిక ఆదాయం ఉన్న వారికి కూడా పన్ను మాఫీ లభిస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

