Big Alert: వైరస్‌తో ఒక్క జిల్లాలోనే కోటికి పైగా కోళ్లు మృతి! కూటమి ప్రభుత్వం ఏం చేస్తోందంటూ వైసీపీ ఆగ్రహం
Chickens Death in Andhra Pradesh | H5N1 వైరస్ సోకడంతో పశ్చిమ గోదావరి ఒక్క జిల్లాలోనే కోటికి పైగా కోళ్లు మృతి చెందాయని వైసీపీ ఆరోపించింది. కూటమి ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు.

కోళ్ల ఫారాలు వద్ద చనిపోయిన కోళ్లు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. మరోవైపు కోడిగుడ్ల ఎగుమతి భారీగా పడిపోయిందని వైసీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. హైపాతోజనిక్ అవేయిన్ ఇన్ల్పూఎంజా స్ట్రెయిన్ (H5N1) వైరస్ సోకినట్లు పశు సంవర్ధక శాఖ అనుమానం వ్యక్తం చేస్తోంది. కూటమి ప్రభుత్వం కోళ్ల వ్యాధులపై కనీసం అవగాహన కల్పించడం లేదని, ఆత్మహత్యలే శరణ్యమని పౌల్ట్రీ రైతులు అంటున్నారంటూ వైసీపీ నేతలు మండిపడుతున్నారు.
Alert! Alert! Alert! 🚨
— YSR Congress Party (@YSRCParty) February 2, 2025
పశ్చిమ గోదావరి జిల్లాలో లక్షలాది కోళ్లు మృత్యువాత
వైరస్ సోకడంతో జిల్లాలో ఇప్పటికే 1 కోటి 20 లక్షలకిపైగా కోళ్లు చనిపోయినట్లు చెప్తున్న అధికారులు
కోళ్ల ఫారాలు వద్ద గుట్టలు గుట్టలుగా పడి ఉన్న కోళ్లు.. భారీగా పడిపోయిన కోడిగుడ్ల ఎగుమతి
హైపాతోజనిక్ అవేయిన్…
కాగా, డిసెంబర్ నెలలో H5N1 వైరస్ కేసులు మొదలయ్యాయని, జనవరిలో వాటి తీవ్రత మరింత పెరిగిందని పౌల్ట్రీ రైతులు చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో 2012, 2020లోనూ వైరస్ రావడంతో కోళ్లు భారీగా చనిపోగా, పౌల్ట్రీ రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆ సమయంలో చికెన్ తినాలంటే కూడా ప్రజలు వణికిపోయేవారు. కరోనా సమయంలో చికెన్ తింటే అనారోగ్యం బారిన పడతామని కొన్ని రోజులు వీటికి దూరంగా ఉన్నారు. అప్పటి ప్రభుత్వం అవగాహనా కల్పించడంతో చికెన్, కోడిగుడ్ల విక్రయాలు ఊపందుకున్నాయి.
Also Read: Mudragada: మాజీ మంత్రి ముద్రగడ ఇంటిపై దాడి, ఇళ్లు కూల్చడానికి తాగుబోతు యత్నం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

