Kejriwal Counters on Yamuna Poison | యమున నీళ్లలో విషం..మరోసారి కౌంటర్ ఇచ్చిన కేజ్రీవాల్ | ABP Desam
యుమునా నదిలో హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం విషం కలిపిందంటూ రెండు రోజుల క్రితం ఢిల్లీ మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రధాని మోదీ కేజ్రీవాల్ చేసిన కామెంట్స్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రధాని ఉండేది కూడా ఢిల్లీలోనే..తాగేది కూడా యమున నీళ్లే..ప్రధాని ని చంపాలని బీజేపీనే ప్లాన్ చేసిందా అంటూ కౌంటర్ ఇచ్చారు మోదీ. దానికి మద్దతుగా హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ నిన్న యమునా నదిలో కొంచెం నీళ్లు తాగి చూపించారు. ఈరోజు దాని మీద మాట్లాడిన కేజ్రీవాల్ నయాబ్ సింగ్ చేసి డ్రామా బాగుందని..ఆయన ఆ నీటిని ఓ గుటక మింగడానికి కూడా భయపడ్డారని అన్నారు. పైగా ఈ కామెంట్స్ చేసినందుకు ఎలక్షన్ కమిషన్ తనకు నోటీసులు పంపిందన్న కేజ్రీవాల్..అందులో ఏ విషయం కలిపారో చెప్పాలని ఆధారాలు చూపించాలని అడిగిందని చెప్పారు. అందుకే యమునా నదిలో తాజాగా పట్టుకొచ్చిన నాలుగు వాటర్ బాటిల్స్ ను అమిత్ షా, హర్యానా సీఎం, రాహుల్ గాంధీ, సచ్ దేవ్ లకు పంపిస్తున్నానన్న కేజ్రీవాల్ వాళ్లు తాగి బాగానే ఉంటే ఆధారాలు తీసుకువస్తానన్నారు.



















