News
News
వీడియోలు ఆటలు
X

Dulquer Salmaan - Venky Atluri : వెంకీతో దుల్కర్ సల్మాన్ - అక్టోబర్‌లో సెట్స్‌కు, సమ్మర్‌లో థియేటర్లకు!

తెలుగు ప్రేక్షకులకూ తెలిసిన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమాను ఈ రోజు ప్రకటించారు.

FOLLOW US: 
Share:

దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) జన్మతః మలయాళీ అయినప్పటికీ... మన దేశంలో అన్ని భాషల ప్రేక్షకులకూ చేరువైన కథానాయకుడు. ముందు 'మహానటి', ఆ తర్వాత 'సీతా రామం' చిత్రాలతో తెలుగులో భారీ విజయాలను తన సొంతం చేసుకున్నారు. తమిళ అనువాద సినిమా 'కనులు కనులను దోచాయంటే' కూడా తెలుగులో హిట్టే. ఇప్పుడు ఆయన మరో తెలుగు దర్శకుడితో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. 

వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్
'తొలిప్రేమ'తో దర్శకుడిగా పరిచయమైన వెంకీ అట్లూరి (Venky Atluri)తో దుల్కర్ సల్మాన్ సినిమా చేస్తున్నారు. కొన్ని రోజుల నుంచి వినబడుతున్న విషయమే ఇది. నేడు అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళ భాషల్లో వంద కోట్ల వసూళ్లు సాధించిన ధనుష్ 'సార్' తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది.

'సార్' తర్వాత మరోసారి ఫార్చ్యూన్, సితారలో
Dulquer Salmaan Venky Atluri movie producers : వెంకీ అట్లూరి రీసెంట్ బ్లాక్ బస్టర్ 'సార్' (తమిళంలో 'వాతి')ని సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ నిర్మించాయి. ఇప్పుడీ దుల్కర్ సల్మాన్ సినిమానూ ఆ రెండు సంస్థలూ నిర్మిస్తున్నాయి. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.
 
ఈ ఏడాది అక్టోబర్‌లో సెట్స్‌కు...
వచ్చే వేసవిలో థియేటర్లకు! 
దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి సినిమా చిత్రీకరణ ఈ ఏడాది అక్టోబర్ నెలలో ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది వేసవికి సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాణ సంస్థలు తెలిపాయి. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నాయి. 

Also Read : పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ బైక్స్ & కారుకు సేమ్ నంబర్, సమంత కారుకూ... హరీష్ శంకర్ 2425 సెంటిమెంట్!

దుల్కర్ సల్మాన్ ఏ భాషలో నటించినా సరే... తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం ఆయనకు అలవాటు. ఏ భాషలో నటిస్తే... ఆ భాష, అక్కడి సంస్కృతి గురించి తెలుసుకుని మరీ క్యారెక్టర్ కోసం ప్రిపేర్ అవుతారు. 'సార్'తో తెలుగు, తమిళ ప్రేక్షకులను మెప్పించిన వెంకీ అట్లూరి... దుల్కర్ సల్మాన్ సినిమా కోసం కూడా యూనివర్సల్ కాన్సెప్ట్ రెడీ చేశారని తెలిసింది. 

దుల్కర్ సల్మాన్ అంటే తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ మంచి మార్కెట్ ఉంది. ఆయన హిందీ సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ఇక, మలయాళం గురించి ప్రత్యేకంగా చెప్పాలా? ఆయనకు హోమ్ గ్రౌండ్! అందుకని, ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Also Read : సునిశిత్‌ను చితకబాదిన మెగా ఫ్యాన్స్ - ఉపాసనకు సారీ

దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి సినిమా కాకుండా... పంజా వైష్ణవ్ తేజ్, శ్రీ లీల జంటగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ సంస్థలు ఓ సినిమా నిర్మిస్తున్నాయి. త్వరలో ఆ సినిమా టైటిల్, టీజర్ విడుదల చేయనున్నారు. 'డీజే టిల్లు' విజయం తర్వాత సిద్ధూ జొన్నలగడ్డతో 'టిల్లు స్క్వేర్' చేస్తున్నారు. ఆ సినిమా సెట్స్ మీద ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గురూజీ త్రివిక్రమ్ దర్శకత్వంలో సితార మాతృసంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఓ సినిమా నిర్మిస్తోంది. సితారలో మరో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. 

Published at : 14 May 2023 09:29 AM (IST) Tags: Dulquer salmaan Venky Atluri Dulquer New Telugu Movie Dulquer Next Movie

సంబంధిత కథనాలు

LGM Teaser: ‘కచ్చితంగా నీ కథ ముగించేస్తారు’ - ధోని నిర్మిస్తున్న ‘ఎల్జీయం’ టీజర్ చూశారా!

LGM Teaser: ‘కచ్చితంగా నీ కథ ముగించేస్తారు’ - ధోని నిర్మిస్తున్న ‘ఎల్జీయం’ టీజర్ చూశారా!

Intinti Ramayanam Trailer: ‘ఇంటింటి రామాయణం’ ట్రైలర్ - ఇంతకీ, ఆ పని చేసింది ఇంటి దొంగేనా?

Intinti Ramayanam Trailer: ‘ఇంటింటి రామాయణం’ ట్రైలర్ - ఇంతకీ, ఆ పని చేసింది ఇంటి దొంగేనా?

10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!

10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!

'గృహం' సీక్వెల్ రెడీ, అందుకే ‘బొమ్మరిల్లు-2’ తీయడం కష్టం: సిద్ధార్థ్

'గృహం' సీక్వెల్ రెడీ, అందుకే ‘బొమ్మరిల్లు-2’ తీయడం కష్టం: సిద్ధార్థ్

కోలీవుడ్‌ కాలింగ్ - శ్రీలీల డేట్స్ కోసం తమిళ నిర్మాతలు వెయిటింగ్

కోలీవుడ్‌ కాలింగ్ - శ్రీలీల డేట్స్ కోసం తమిళ నిర్మాతలు వెయిటింగ్

టాప్ స్టోరీస్

తెలంగాణ రాజకీయాల్లో ‘ధరణి’ దుమారం- తగ్గేదేలే అంటున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు!

తెలంగాణ రాజకీయాల్లో ‘ధరణి’ దుమారం- తగ్గేదేలే అంటున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు!

YS Viveka Case : వివేకా లెటర్‌కు నిన్ హైడ్రిన్ టెస్టుకు ఓకే - కోర్టు అనుమతి

YS Viveka Case :  వివేకా లెటర్‌కు నిన్ హైడ్రిన్ టెస్టుకు ఓకే - కోర్టు అనుమతి

Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!

Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!

Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్‌ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!

Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్‌ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!