రీసెంట్ గా పండంటి బిడ్డలకు జన్మనిచ్చిన సినీ సెలబ్రిటీలు వీళ్లే! ప్రేమ వివాహం చేసుకున్న నయనతార, విఘ్నేష్ శివన్ సరోగసి ద్వారా కలలకు తల్లిదండ్రులయ్యారు. దుబాయ్ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న పూర్ణ, 2023 మొదటి వారంలో మగబిడ్డకు జన్మనిచ్చింది. యంగ్ హీరో నవీన్ చంద్ర భార్య ఓర్మా పండంటి మగబిడ్డకు జన్మినిచ్చింది. టాలీవుడ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ దంపతులకు కొద్ది నెలల క్రితం బాబు పుట్టాడు. సింగర్ రేవంత్ బిగ్ బాస్ సీజన్-6లో ఉన్న సమయంలోనే ఆయన భార్య అన్విత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అంజనా శ్రీలిఖిత అనే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్న సామ్రాట్ ఆడ బిడ్డకు తండ్రయ్యాడు. రెండో పెళ్లి చేసుకున్న నిర్మాత దిల్ రాజు, వ్యాఘారెడ్డి దంపతులకు పండంటి బాబు జన్మించాడు. నితిన్ రాజు అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్న ప్రణీత సుభాష్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ భార్య ప్రియా మోహన్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. యంగ్ హీరో రాహుల్ రవీంద్రన్, సింగర్ చిన్మయి దంపతులు ట్విన్స్ కు జన్మనిచ్చారు. 2017లో వీరేంద్ర చౌదరి అనే తెలుగు వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న నమిత కవలలకు జన్మనిచ్చింది.