అన్వేషించండి

APSRTC: వాట్సప్ బస్ టికెట్లు అనుమతించండి - అధికారులకు ఏపీఎస్ఆర్టీసీ కీలక ఆదేశాలు, టికెట్లు బుక్ చేసుకోండిలా!

Andhra News: వాట్సప్ గవర్నెన్స్‌లో భాగంగా బస్ టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులను అనుమతించాలని యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై క్షేత్ర స్థాయి సిబ్బందికి అవగాహన కల్పించాలని ఆదేశాలిచ్చింది.

APSRTC Bus Tickets Booking Process In Whatsapp: ప్రజలకు మరింత సులువుగా సేవలు అందించేలా ఏపీ ప్రభుత్వం వాట్సాప్ ఆధారిత సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆర్టీసీ (APSRTC) బస్ టికెట్లను వాట్సప్ ద్వారా బుక్ చేసుకున్న ప్రయాణికులను బస్సుల్లో అనుమతించాలని జిల్లాల యంత్రాంగానికి యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. దూరప్రాంత బస్ సర్వీసులు అన్నింటా వాట్సప్ ద్వారా టికెట్ బుకింగ్‌కు అవకాశం కల్పించినట్లు పేర్కొంది. దీనిపై క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించాలని అన్ని జిల్లాల అధికారులు, డిపో మేనేజర్లకు ఆదేశాలిచ్చింది.

బస్ టికెట్లు బుక్ చేసుకోండిలా..

వాట్సప్ ద్వారా ప్రభుత్వ సేవలు పొందాలనుకునే వారు.. 9552300009 నెంబరుకు తొలుత హాయ్ అని మెసేజ్ పంపాలి. ఆ తర్వాత ఏయే సేవలు అందుబాటులో ఉన్నాయో చూపిస్తుంది. అందులో ఆర్టీసీ టికెట్ బుకింగ్/రద్దు ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత బయల్దేరే ప్రదేశం, గమ్యస్థానం, ప్రయాణ తేదీ వంటి వివరాలు ఎంటర్ చేయాలి. అనంతరం ఏయే సర్వీసులు, ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయో చూపిస్తుంది. వీటిలో సీట్లు ఎంపిక చేసుకుని ఆన్ లైన్ డిజిటల్ చెల్లింపులు చేస్తే సరిపోతుంది. ఆన్ లైన్ పేమెంట్ జరిగిన వెంటనే టికెట్ బుక్ చేసుకున్న వ్యక్తి వాట్సాప్ నెంబరుకు టికెట్ వస్తుంది. ఈ సేవలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

తొలిదశలో 161 ప్రభుత్వ సేవలు

దేశంలోనే తొలిసారి వాట్సప్ గవర్నెన్స్ సేవల్ని ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఇటీవల మంత్రి నారా లోకేష్ దీని ద్వారా 161 ప్రభుత్వ సేవల్ని ప్రారంభించారు. మీరు వాట్సాప్ నెంబర్‌కు ఒక్క మెస్సేజ్ చేస్తే చాలు.. గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగకుండానే మీకు సర్టిఫికెట్స్ సైతం ఆన్‌లైన్‌లోనే అందిస్తుంది ప్రభుత్వం. వాట్సాప్ గవర్నెన్స్ మొదటి విడతలో రెవెన్యూ, దేవాదాయ, ఏపీఎస్ఆర్టీసీ, ఎనర్జీ, అన్న క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ వంటి పలు శాఖల్లో సేవలను అందుబాటులోకి తెచ్చింది. రెండో దశలో 360 సేవలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. నారా లోకేష్ చొరవ తీసుకుని మెటా సంస్థతో గత ఏడాది అక్టోబర్ నెలలో చర్చలు జరిపి, ప్రాసెస్ మొదలుపెట్టారు. 'మన మిత్ర - ప్రజల చేతిలో ప్రభుత్వం' వాట్సాప్ గవర్నెన్స్ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఏ సేవలంటే..?

దేవాదాయ బుకింగ్ సేవలు, ఫిర్యాదు సంబంధిత సేవలు, ఏపీఎస్ఆర్టీసీ సేవలు, సీఎంఆర్ఎఫ్ సేవలు, సీడీఎంఏ సేవలు, ఎనర్జీ సేవలు, వ్యవసాయ, మౌలిక వసతుల అభివృద్ధి, విద్యుత్తు, పర్యాటక తదితర సేవలు వాట్సప్ గవర్నెన్స్ ద్వారా అందుబాటులోకి వచ్చాయి. దీని ద్వారా మీరు ఫిర్యాదులు కూడా ఇవ్వొచ్చు. మీ పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. దాని ద్వారా మీ ఫిర్యాదు గురించి లేటెస్ట్ అప్డేట్ సైతం తెలుసుకునే వీలుంటుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పథకాల ద్వారా కలిగే లబ్ధి లాంటి అంశాలు సైతం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. 

Also Read: Mudragada Padmanabha Reddy: మాజీ మంత్రి ముద్రగడ ఇంటిపై దాడి, ఇళ్లు కూల్చడానికి తాగుబోతు యత్నం

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Minster Lokesh: అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు - 3,168 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ - చేనేతలకు నేతన్న భరోసా !
ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు - 3,168 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ - చేనేతలకు నేతన్న భరోసా !
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Junk Food Ban in Schools: స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
Shivani Nagaram: శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
Telangana Latest News:  తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
Euphoria OTT : నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
Embed widget