Book A APSRTC Ticket In AP Whatsapp Governance: ఏపీ ప్రభుత్వ వాట్సాప్ నెంబర్ నుంచి ఆర్టీసీ బస్‌టికెట్ ఎలా బుక్ చేయాలి?
Andhra Pradesh Whatsapp Governance:ఏపీ ప్రభుత్వం ప్రజలకు మెరుగైనా సత్వర సేవలు అందించేందుకు వాట్సాప్ గవర్నెన్స్‌ను ప్రారంభించింది. 9552300009 ద్వారా 161 సేవలు అందుతున్నాయి.

Andhra Pradesh Whatsapp Governance Number: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా వాట్సాప్ గవర్నెన్స్‌ను ప్రారంభించింది. ఇందులో దాదాపు 161 సేవలను అందిస్తోంది. ఇప్పటి వరకు ప్రైవేటు బ్యాంకులు ఇలాంటి సేవలు అందిస్తూ వచ్చాయి. మీ అకౌంట్ నెంబర్ రిలేటెడ్ క్వారీల కోసం బ్యాంకులు ఈ సేవలు అందించేవి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటిని ప్రజలకు చేరువ చేసింది.
ముందుగా మీరు ప్రభుత్వం ఇచ్చిన వాట్సాప్ నెంబర్ 9552300009ను సేవ్ చేసి పెట్టుకోవాలి. ఇలా సేవ చేసుకున్న తర్వాత వాట్సాప్ రిఫ్రెష్ చేసి చూస్తే మీకు గవర్నమెంట్ ఆఫ్ ఆంద్రప్రదేశ్ అనే వెరిఫైడ్ అకౌంట్ చూపిస్తుంది. అందుకో మీకు కావాల్సిన సేవలను పొందవచ్చు. ఈ వాట్సాప్ నెంబర్‌కు మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే అక్కడి నుంచి మీకు రిప్లై వస్తుంది.
సమాచారం అంతా తెలుగులోనే ఉంటుంది. వాట్సాప్‌లో ఆంధ్కరప్రదేశ్ ప్రభుత్వ పౌర సహాయక సేవలకు స్వాగతం. మీ సౌకర్యమే మా ప్రాధాన్యం. వివిధ పౌర సేవలను సులభంగా త్వరితంగా, పారదర్శకంగా పొందేందుకు సంపూర్ణ మద్దతును అందిస్తున్నాం దయచేసి మీకు కావాల్సిన పౌరసేవలను ఎంచుకోండని చూపిస్తుంది.
అందులో సేవను ఎంచుకోండి అని హైలైట్ చేసి ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే... ప్రభుత్వ సైట్ ఓపెన్ అవుతుంది. అందులో వాట్సాప్‌లో ప్రభుత్వం అందించే 161 సేవలు ఉంటాయి. దయచేసి ఒక సేవ ఎంచుకోండి అని ఉన్న చోట క్లిక్ చేయాలి. అక్కడ క్లిక్ చేస్తే 9 విభాగాలు కనిపిస్తాయి.
అవి ఇవే:-
1. దేవాలయ బుకింగ్ సేవలు
2. ఫిర్యాదు పరిష్కార సేవలు
3. ఏపీఎస్‌ఆర్టీసీ సేవలు
4. ఎనర్జీ సేవలు అంటే విద్యుత్ రిలేటెడ్ సేవలు
5. సీఎంఆర్‌ఎఫ్ సేవలు
6. సీడీఎంఏ సేవలు
7. రెవెన్యూ సేవలు
8. ఆరోగ్య కార్డు సేవలు
9. పోలీస్ శాఖ సేవలు
ఇలా తొమ్మిది విభాగాలు ఉంటాయి. అందులో మనకు కావాల్సిన వాటిపై క్లిక్ చేసి సేవలు పొందవచ్చు.
ఆర్టీసీ టికెట్ బుక్ చేయాలనుకుంటే ఆర్టీసీ సేవలపై టిక్ చేయాలి. అలా చేసిన వెంటనే టికెట్ బుక్ చేసుకోవడమా, టికెట్ రద్దు చేసుకోవడమా ఏ సేవ కావాలో అని అడుగుతుంది. అందులో టికెట్ బుకింగ్‌పై క్లిక్ చేస్తే నిర్దారించమని అడుగుతుంది. వెంటనే ఓకే చేస్తే మెసేజ్ సెంట్ అవుతుంది.
Also Read: కేసుల్లో మగ్గిపోతున్న లీడర్, క్యాడర్ - వైసీపీ హైకమాండ్ కనీస సాయం చేయడం లేదా ?
అలా మెసేజ్ వెళ్లిన వెంటనే ఏపీ ఎస్‌ఆర్టీసీ పోర్టల్ నుంచి మీకు మెసేజ్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బుస్ టికెట్ బుకింగ్ సేవను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు, దయచేసి కొనసాగించడానికి బుక్‌నౌ పై క్లిక్ చేయండి అని వస్తుంది. మీరు ఇప్పుడే బుక్ చేయండని క్లిక్ చేస్తే మిగతా వివరాలు వస్తాయి.
మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి టికెట్ బుక్ చేస్తున్నారో చెప్పాల్సి ఉంటుంది. అసలు మీరు ఏ బస్‌లో ప్రయాణించాలనుకుంటున్నారో నిర్దారించాలి. అంటే ఏసీ బస్ కావాలా నాన్ ఏసీ బస్ కావాలో చెప్పాలి. అది ఓకే చేస్తే అందుబాటులో ఉన్న బస్‌లు వస్తాయి. వాటిలో ఒకదాని ఎంచుకుంటే బస్ సీట నెంబర్లు కనిపిస్తాయి.
అందులో ఖాళీగా ఉన్నవి రెడ్ మార్క్‌తో కనిపిస్తాయి. ఖాళీగా ఉన్న సీట్లలో మీకు కావాల్సిన సీటును ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేసిన తర్వాత మీరు పేరు, ఏజ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ, జెండర్, మీరు సీనియర్ సిటిజనా, లేకుంటే నార్మల్ పబ్లికా లాంటి వివరాలు అడుగుతుంది. తర్వాత అమోంట్ పేమెంట్ వివరాలు టైప్ చేసి కన్ఫామ్ చేస్తే మీ టికెట్ బుక్ అవుతుంది. మిగతా సేవలను ఇలానేపొందవచ్చు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

